ఇప్పటికీ అక్కినేని ఫ్యామిలీతోనే సమంత: ఆ ఇంట్లో నాగ చైతన్యతో.. బయటికొచ్చిన షాకింగ్ న్యూస్!
ఏ సినీ పరిశ్రమలో అయినా ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి కామన్‌గా కనిపిస్తుంటాయి. అయితే, తెలుగులో అలాంటివి తక్కువ అనుకునే సమయంలోనే కొందరు జంటలుగా మారి, పెళ్లి చేసుకుని, తర్వాత విడాకులు తీసుకున్నారు.
అలాంటి వారిలో టాలీవుడ్ కపుల్ సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య జంట ఒకటి. వీళ్లిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకుని విడిపోయారు. అయినా వీళ్ల గురించి ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా సమంత ఇంకా అక్కినేని ఫ్యామిలీతోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు మీకోసమే!

అలా ప్రేమ పెళ్లితో ఒక్కటై: అక్కినేని నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు కలిసి 'ఏమాయ చేశావే' సినిమా చేశారు. ఈ మూవీ చేస్తున్న సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. 'ఆటోనగర్ సూర్య' సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించి ఆ తర్వాత ఈ సినీ జంట వివాహం చేసుకుంది. తర్వాత చాలా కాలం అన్యోన్యంగా ఉన్నారు.

విడాకులు తీసుకున్నారు: సినీ పరిశ్రమలోనే బెస్ట్ కపుల్‌గా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాగ చైతన్య - సమంత విడాకులు తీసుకున్నారు. తద్వారా నాలుగేళ్ల తమ వివాహ బంధానికి పుల్‌స్టాప్ పెట్టేశారు. ఈ విషయాన్ని కొన్నేళ్ల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు, ఇకపై తామిద్దరం భార్యా-భర్తలుగా కొనసాగలేమని, చాలా చర్చలు, ఆలోచనల తర్వాత విడిపోతున్నామని చెప్పారు.

విడాకులపై చాలా డౌట్లు: నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుని చాలా కాలమే అవుతోన్నా అసలు వీళ్లిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు? దీని వెనుక కారణాలు ఏంటి? వీళ్లిద్దరి మధ్య ఏ విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి? ఇలా రకరకాల అనుమానాలకు మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదనే చెప్పాలి. దీంతో చాలా మంది ఎవరికి తోచిన విధంగా వాళ్లు చెప్పుకుంటూ దీన్ని హైలైట్ చేస్తున్నారు.

జ్ఞాపకాలపై కూడా పుకార్లు: విడిపోయిన తర్వాత సమంత, నాగ చైతన్య గురించి మరిన్ని ఎక్కువ పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నా ఒకరి దగ్గర ఒకరి జ్ఞాపకాలు పదిలంగానే ఉంచుకున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, వాళ్ల వాళ్ల ఫ్యామిలీలతో కూడా టచ్‌లోనే ఉన్నారని అంటున్నారు. అలాగే, కలిసి సినిమా కూడా చేస్తారని టాక్ నడుస్తోంది.
విడిపోయినా ఫ్యామిలీతో: సమంత, నాగ చైతన్య బంధం గురించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ సమాచారం ప్రకారం.. వీళ్లిద్దరూ విడిపోయి చాలా కాలమే అవుతున్నప్పటికీ ఈ పెళ్లి ఫొటోను మాత్రం నాగార్జున ఇంట్లోని హాల్‌లో భద్రంగానే ఉంచారట. వాళ్లు విడిపోయారు కదా ఇంకెందుకు అని చాలా మంది అంటున్నా దాన్ని మాత్రం తీయడం లేదని తెలిసింది.

అదే అసలైన కారణమా: తాజాగా వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. విడిపోయిన తర్వాత కూడా సమంత, నాగ చైతన్య పెళ్లి ఫొటోను తీసేయకపోవడానికి కారణం అందులో అక్కినేని ఫ్యామిలీ మెంబర్లు మొత్తం ఉండడమే అని తెలిసింది. అందులో నాగార్జున, అమల, అఖిల్‌తో పాటు చాలా మంది అక్కినేని కుటుంబ సభ్యులు ఉన్నారట. ఈ వార్తలో ఎంత నిజముందో కానీ, ఇది హాట్ టాపిక్ అవుతోంది.


Click it and Unblock the Notifications











