స్టార్ దర్శకుడితో అక్కినేని ఫ్యామిలీలో మరో మల్టీస్టారర్.. కానీ ఈ సారి ఇద్దరు మాత్రమే!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ లకు పెరుగుతున్న డిమాండ్ చూస్తుంటే త్వరలో ఏడాదికి రెండు మూడు సినిమాలు ఇలానే వచ్చేలా ఉన్నాయని అనిపిస్తోంది. స్టార్ స్టేటస్ ని పక్కనపెట్టి హీరోలు వేస్తున్న అడుగులు చూస్తుంటే మార్కెట్ స్థాయి కూడా అమాంతంగా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కూడా కలిసి స్క్రీన్ చేసుకునే ఆనవాయితీ మళ్ళీ మొదలైంది. అందులో అక్కినేని వారి నుంచి మరో సినిమా రాబోతోంది.

అక్కినేని హీరోలు..మరో మల్టీస్టారర్
మనం సినిమాతో ఇదివరకే బాక్సాఫీస్ హిట్ అందుకున్న అక్కినేని హీరోలు ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో పాటు నాగార్జున, నాగ చైతన్య ముఖ్య పాత్రల్లో నటించగా అఖిల్ చివరలో ఒక గెస్ట్ రోల్ చేసిన విషయం తెలిసిందే. అందులో అఖిల్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఎక్కువగా లబించలేదు.

మహేష్ దర్శకుడితో..
ఇక ఈ సారి అఖిల్ తోనే ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నాడు నాగార్జున. ఇక వారిని డైరెక్ట్ చేయబోయే దర్శకుడు మరెవరో కాదు వరుస హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ లాంటి స్టార్ హీరోను కూడా చాలా కొత్తగా చూపించిన అనిల్ అంతకుముందు F2 తో ఎలాంటి హిట్ అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే..
ఇక మల్టీస్టారర్ కథను హ్యాండిల్ చేయగల దర్శకుడని నీరూపించుకున్న అనిల్ తో నాగార్జున వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అఖిల్ , నాగ్ రేంజ్ కి తగ్గట్లుగా మంచి స్టోరీ సెట్ చేసుకున్న అనిల్ వచ్చే ఏడాదిలో వీరి సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. అంతకంటే ముందు మరో సినిమా చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు.

ఆ సినిమాలు పూర్తయిన తరువాత..
ఇక మరోవైపు నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అనంతరం ప్రవీణ్ సత్తారుతో మరో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో సంక్రాంతికి హిట్టు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాను స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. వీరి ప్రాజెక్టులు పూర్తయిన తరువాతే మల్టీస్టారర్ సినిమాకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











