నాగచైతన్య కొత్త చిత్రం టైటిల్ ‘హమ్’
హైదరాబాద్ : అక్కినేని కుటుంబానికి చెందిన అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఈ మూడు తరాల ముగ్గురు హీరోలు కలిసి ఓ భారీ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. 'ఇష్క్' చిత్ర దర్శకుడు విక్రమ్‌కుమార్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి 'త్రయం' అనే టైటిల్‌ని ఖారారు చేశారని ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'హమ్' అనే టైటిల్‌ని ఖరారు చేయనున్నారని సమాచారం.
ఇటీవలే ఈ టైటిల్‌ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థపై ఫిలింఛాంబర్‌లో రిజిస్టర్ చేశారు. దీంతో మూడు తరాల అక్కినేని కథానాయకులు నటించే చిత్రానికి 'హమ్' అనే టైటిల్‌ని దాదాపుగా ఖరారు చేసిన సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాంఛనంగా ప్రారంభం కానుంది.
వచ్చే ఏడాది తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తన కుమారుడు నాగచైతన్యతో కలిసి తను నటించే సినిమా అన్నపూర్ణ స్టూడియో బేనరుపై మొదలవుతుందని నాగార్జున తెలిపారు. ' ఈ సినిమాకి 'త్రయం' అనే టైటి ల్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అది నిజం కాదు. ఆ సినిమాకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. '13బి', 'ఇష్క్' చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రంకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు' అని నాగార్జున తెలియచేసారు.
ఈపాటికే విక్రమ్ పూర్తి స్థాయి స్క్రిప్టును అక్కినేని త్రయానికి వినిపించారని, నాగ్ సైతం ఈ చిత్రంలో నటించడానికి సముఖత చూపారని తెలిసింది. తొలుత వాల్డ్ డిస్నీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని ప్రచారం సాగినా..అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున స్వయంగా నిర్మిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 'ఇష్క్'కి ఛాయాగ్రహణం అందించిన పి.సి.శ్రీరామ్ మరోసారి ఈ సినిమా కోసం విక్రమ్‌తో కలిసి పనిచేయనున్నారు. 'హమ్ 'లో హీరోల సరసన నటించే హీరోయిన్స్ ను వెతికే పనిలో దర్శక హీరోలు నిమగ్నమై ఉన్నారని మరో సమాచారం.


Click it and Unblock the Notifications











