సమంత క్లోజ్ డైరెక్టర్ ఫ్రెండ్ తో నాగచైతన్య సినిమా.. అంతా సెట్ కానీ, సమంత ప్లేస్ లో ఎవరంటే?

ఇటీవల నాగచైతన్య, సమంత విడిపోయిన విషయం ఇప్పటికీ చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. ఇద్దరూ డిస్టర్బ్ అవుతున్నా సరే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అవుతున్నారు. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమాతో హిట్ కొట్టగా ఇప్పుడు సినిమా షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. మరో పక్క సమంత కూడా మరో రెండు సినిమాలు అనౌన్స్ చేసి తీర్థయాత్రలకు వెళ్ళింది. అయితే ఇప్పుడు ఆసక్తికర వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

కొత్త ప్రాబ్లం తెరమీదకు

కొత్త ప్రాబ్లం తెరమీదకు

అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంతని ట్రోల్ చేయడం జరిగింది, ఆమె ఆ ట్రోల్ల్స్ కి ఘాటుగా రిప్లై ఇచ్చింది. అయినా తగ్గకపోవడంతో కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఆమెకు మద్దతుగా తీర్పు కూడా ఇచ్చింది. ఇక నాగ చైతన్య తమ తర్వాత సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక్కడే చైతూ సినిమా విషయంలో కొత్త ప్రాబ్లం తెరమీదకు వచ్చింది.

నందిని రెడ్డితో సినిమా

నందిని రెడ్డితో సినిమా

ఇటీవల నాగచైతన్య లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు రావడం కొత్తేమీ కాదు ఎందుకంటే సమంత, నాగచైతన్య కలిసి ఉన్నప్పుడే వీరి కాంబో సినిమా రానున్నట్టు ప్రచారం జరిగింది. అప్పట్లో సమంత హీరోయిన్ అని కూడా అనుకున్నారు. ఆ కాంబో సినిమా పట్టాలు ఎక్కలేదు.

కానీ ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, నందినీ రెడ్డి కాంబినేష‌న్‌లో

కానీ ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, నందినీ రెడ్డి కాంబినేష‌న్‌లో

ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రాబోతుందని అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై నాగచైతన్య అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నందిని రెడ్డి డైరెక్షన్ లో సమంత జబర్దస్త్, ఓ బేబీ అనిరి రెండు సినిమాలు చేసింది. అలాగే సమంత చేసిన టాక్ షో 'సామ్ జామ్'కి కూడా నందిని రెడ్డినే డైరెక్టర్. వీళ్లిద్దరు పర్సనల్ గా కూడా క్లోజ్ ఫ్రెండ్స్.

 ఇక లేనట్టే?

ఇక లేనట్టే?

నిజానికి గతంలో వీరు విడిపోక ముందు నాగ చైతన్య - సమంత జోడీ మరోసారి బిగ్ స్క్రీన్ పై కనిపించబోతున్నట్లు ప్రచారం జరిగింది. 'ఏ మాయ చేసావె' సినిమాతో మొదటిసారి కలిసి నటించిన ఈ జంట అప్పుడే ఇద్దరికీ హిట్టుతో అసలైన కెరీర్ ని మొదలుపెట్టారు. ఆటోనగర్ సూర్య చేసిన తర్వాత స్నేహితులుగా కొనసాగుతూ మరింత దగ్గరైన చై, సామ్ మనం సినిమాతో మెప్పించి అనంతరం ళ్లితో ఒకటై కెరీర్ ను మరింత ముందుకు తీసుకెళ్లారు.

Recommended Video

Manu Charitra Trailer Preface Video | Shiva Kandukuri, Megha Akash
అసలు పట్టాలు ఎక్కుతుందా?

అసలు పట్టాలు ఎక్కుతుందా?


అయితే పెళ్లి తర్వాత వారు చేసిన ఒకే ఒక్క సినిమా మజిలీ. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పటివరకు డిజాస్టర్ సినిమాలతో సతమతమైన నాగ చైతన్యకు కూడా మజిలీ మంచి బూస్ట్ ఇచ్చింది. దీంతో మరోసారి వీరిని తెరపై చూపించేందుకు చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. ఫైనల్ గా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి సమంత నాగ చైతన్యలతో సినిమా ఫిక్స్ చేసినట్టు అప్పుడు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు విడాకుల నేపథ్యంలో హీరోయిన్ ను మార్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే సినిమా అసలు పట్టాలెక్కక పోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X