హాట్ స్టార్ నుంచి మరో ఆఫర్ అందుకున్న నాగార్జున.. బిగ్ బాస్ తో పాటు అది కూడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సీనియర్ హీరోలు కూడా నేటి తరం హీరోల కంటే చాలా ఫాస్ట్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అయితే కొంతమంది సీనియర్స్ మాత్రం కేవలం సినిమాలలోనే కాకుండా ఓటీటీ ప్రపంచంలో కూడా చాలా లేటెస్ట్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీ షోను మొదలు పెట్టబోతున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా హాట్ స్టార్ లో మరొక ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆ షోతో పెరిగిన స్థాయి

ఆ షోతో పెరిగిన స్థాయి


అక్కినేని నాగార్జున కేవలం సినిమాల తోనే కాకుండా బుల్లితెర ప్రేక్షకులను కూడా పలు రియాలిటీ షోలతో ఎంతగానో ఆకట్టుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఇదివరకే మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో లో హోస్ట్ గా వ్యవహరించి మంచి గుర్తింపును అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా బిగ్ బాస్ ద్వారా కూడా ఆయన స్థాయి మరింత పెరిగింది అని చెప్పాలి.

నాగార్జున సక్సెస్

నాగార్జున సక్సెస్

బిగ్ బాస్ ను తెలుగులో మొదట ఎవరూ హోస్ట్ చేస్తారు అనే విషయంలో అనేక రకాల సందేహాలు వెలువడ్డాయి. ఎన్టీఆర్ నాని మొదటి రెండు సీజన్లను బాగానే స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత ఆ యువ హీరోలు ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఒకవైపు సినిమాలు మరోవైపు రియాలిటీ షోలు అంటే అంత సాధారణమైన విషయం కాదు అని వారికి అర్థమైపోయింది. కానీ నాగార్జున మాత్రం పక్కా ప్రణాళికలతో చాలా కూల్ గా రెండు పడవల ప్రయాణం చేసి సక్సెస్ అందుకున్నారు.

బిగ్ బాస్ ఓటీటీ హోస్ట్ గా..

బిగ్ బాస్ ఓటీటీ హోస్ట్ గా..


నాగార్జున బిగ్ బాస్ మూడవ సీజన్ నుంచే హోస్ట్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన పర్ఫెక్ట్ కనిపించడంతో నిర్వాహకులు కూడా మిగతా హీరోల ను పెద్దగా సంప్రదించలేదు. ఆ తర్వాత కూడా ఆయనే ఇష్టంగా కంటిన్యూ అవుతున్నారు. ఇక బిగ్ బాస్ ఆరో సీజన్ కంటే ముందు బిగ్ బాస్ తెలుగు ఓటీటీ షో మొదలు కాబోతున్న విషయం తెలిసిందే. దానికి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.

హాట్ స్టార్ తో మరో డీల్

హాట్ స్టార్ తో మరో డీల్


అయితే హాట్ స్టార్ లో బిగ్ బాస్ ఓటీటీ షోతో పాటు నాగార్జున మరొక ప్రాజెక్ట్ చేసేందుకు కూడా డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం.. హాట్ స్టార్ ప్రత్యేకంగా రూపొందించబోయే ఒక ఒక వెబ్ సిరీస్ లో నాగార్జున కనిపించబోతున్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్టును ఒక కొత్త యువ దర్శకుడు రెడీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగర్జున ఇదివరకే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి స్క్రిప్టు కూడా ఉన్నట్లు సమాచారం. మరొకసారి ఫైనల్ గా వెబ్ సిరీస్ ప్లానింగ్ కూడా వివరిస్తే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆ సినిమాలతో బిజీగా..

ఆ సినిమాలతో బిజీగా..


ఇక నాగార్జున ఇటీవల బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకున్నాడు. అయితే ఆ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫినిష్ చేయలేదు. ఇక ప్రస్తుతం నాగార్జున చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి అందులో ది గోస్ట్ అనే ప్రాజెక్టును ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక మరొక కొత్త దర్శకుడితో నాగార్జున త్వరలోనే డిఫరెంట్ యాక్షన్ ఫిలిం స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. బాలీవుడ్ బ్రహ్మాస్త్రలో కూడా నాగ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X