Coolie: రజనీకాంత్, అమీర్ ఖాన్, ఉపేంద్రతో ఓకే.. నాగార్జునతోనే అసలు ప్రాబ్లం.. ఏమైందంటే?
కూలి.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోయే చిత్రమిది. ఇప్పటికే రజనీకాంత్ జైలర్ చిత్రంతో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఇక సంచలన దర్శకుడు లోకేష్ కనరాజ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కూలి చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున నటించడం విశేషం. సిమాన్ అనే పాత్రలో అలరించబోతున్నారు. నాగ్ తోపాటు మరికొందరు స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఈ క్రమంలో నాగార్జునతో వచ్చిన ఓ సిచ్యుయేషన్ ను దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ సందర్భంలో చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
భారీ బడ్జెట్ తో కూలి చిత్రం..
ఖైదీ, విక్రమ్, లియో వంటి మాస్టర్ పీస్ లను అందించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం కూలి. ఈ చిత్రంలో భారీ తారాగణం నటించడం, టాప్ టెక్నీషియన్లు పనిచేయడం, శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండటం, స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే స్పెషల్ డ్యాన్స్ చేయడం, పలువురు స్టార్స్ క్యామియో అప్పీయరెన్స్ ఇవ్వబోతున్నారు. దీంతో సినిమాకు రూ.350 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.

నాగార్జునతో లోకేష్ కు టఫ్ సిచ్యూయేషన్..
కూలి చిత్రానికి స్టార్ కాస్ట్ ను ఎంపిక చేసే సమయంలో లోకేష్ కనగరాజ్ పలువురు స్టార్స్ ను కలిశారు. రజనీకాంత్ సినిమా కావడంతో ఆయన స్థాయికి తగిన స్టార్ నటులను ఎంపిక చేయాల్సి ఉందంట. దాంతో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, క్యామియోలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లను ఎంపిక చేశారు. అయితే వారికి కథ చెప్పే సమయంలో ఏమాత్రం సందేహించకుండా ఓకే అని చెప్పారంట. కానీ నాగార్జునకు కథ చెప్పగా మొదటగా సందేహంలో ఉన్నారంట. ఆ తర్వాత నాలుగైదు సార్లు తన పాత్ర, కథను చెప్పమని అడిగారంట. ఇక లోకేష్ ఓపిగ్గా చెప్పి ఒప్పించారంట. అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ ఈజీగా ఓకే చెప్పినా.. నాగార్జునతో ఒప్పించడం కాస్తా కష్టమైందని ప్రచారం.
కూలి భారీ బిజినెస్..
రజనీకాంత్ కూలి చిత్రం ఆగస్టు 14, 2025న ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ ప్రధాన ప్రాంతీయ భాషలతో కలిపి విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. దీంతో ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని రూ.500 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టుగా ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. రూ.600 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను నిర్ణయించారు.
నాగార్జున 100వ చిత్రం..
టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. లెజెండరీ యాక్టర్, నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు తనయుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సాధించారు. ఇప్పటి వరకు అక్కినేని నాగార్జున హీరోగా 99 చిత్రాల్లో నటించారు. తన రాబోయే 100వ చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. నాగార్జున 100వ చిత్రాన్ని తమిళ దర్శకుడు ఆర్ కార్తీక్ డైరెక్టర్ చేయబోతున్నారని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











