Jabardasth లో క్లిక్కయిన రైటర్ తో నాగార్జున డీల్.. త్వరలోనే బిగ్ ప్రాజెక్ట్!
అక్కినేని నాగార్జున కొత్తవారితో సినిమా చేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆయన ఎక్కువగా కొత్త దర్శకులతో సినిమాలను తెరపైకి తీసుకువచ్చి మంచి బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్నారు. అందులో రామ్ గోపాల్ వర్మ ఒకరిని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే నాగార్జున ఈ మధ్యకాలంలో మాత్రం కొత్త దర్శకులతో సినిమాలు పెద్దగా చేసింది లేదు. ఇక ఇప్పుడు మాత్రం యువర్ రైటర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అతను ఇంతకుముందు జబర్దస్త్ షోలో మంచి రైటర్ గా గుర్తింపు అందుకున్న రచయిత అని తెలుస్తోంది.
జబర్దస్త్ ద్వారా కేవలం కమెడియన్స్ మాత్రమే కాకుండా కొంతమంది రైటర్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక అలాంటి వారిలో ముఖ్యంగా ప్రసన్నకుమార్ మంచి క్రేజ్ అందుకున్నారు. ప్రసన్నకుమార్ మొదట త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో తెరపైకి తీసుకువచ్చిన సినిమాలకు రైటర్ గా వర్క్ చేస్తూ వస్తున్నాడు. వీరి కలయికలో వచ్చిన మొదటి సినిమా చూపిస్త మామ మంచి సక్సెస్ అందుకుంది. ఆ తరువాత నేను లోకల్ కూడా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

ఇక చివరిగా హలో గురు ప్రేమకోసమే అనే సినిమా వచ్చింది. ఇప్పుడు రవితేజతో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. అయితే ఎప్పటినుంచో ఈ రచయిత దర్శకుడిగా మారాలని అనుకుంటున్నాడు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్లో కూడా అప్పట్లో సినిమా చేయబోతున్నట్లు ఒక టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు నాగార్జున ప్రసన్న కుమార్ కు ఆఫర్ ఇవ్వబోతున్నట్లు మరొక టాక్ వినిపిస్తోంది. నాగార్జున తన సొంత ప్రొడక్షన్ లోనే ఈ దర్శకుడిని పరిచయం చేస్తూ తనే హీరోగా ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంలో అధికారికంగా క్లారిటీ కూడా రాబోతోందట. ఇక చివరిగా నాగర్జున ది గోస్ట్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అలాగే నాగర్జున మోహన్ రాజా తో కూడా ఒక సినిమా చేసే విధంగా చర్చలు జరుపుతున్నాడు.


Click it and Unblock the Notifications











