15ఏళ్ళ తరువాత మళ్ళీ ఆ దర్శకుడితో నాగార్జున సినిమా.. అనుష్కతో రొమాన్స్?
అక్కినేని నాగార్జున ఒక విధంగా కొడుకులకంటే హై రేంజ్ లోనే సినిమాలు చేస్తున్నాడు. ఇద్దరు తనయులు కూడా ఇంకా ఆయన స్థాయిలో బాక్సాఫీస్ హీట్స్ అందుకోవడం లేదు. నాగార్జున సినిమాలు ఒక విధంగా ప్లాప్ అయినా కూడా ఆ ఎఫెక్ట్ తరువాత సినిమాపై పడకుండా చూసుకుంటాడు. ఇక వయసుతో ఎలాంటి మాయ చేస్తాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ప్రస్తుతం ఆయన వయసు 60 అంటే నమ్మడం కష్టంగానే ఉంటుంది. ఈ నెల 29న మరో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. అయితే బర్త్ డే కానుకగా నాగార్జున ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు టాక్ వస్తోంది. నాగార్జున నెక్స్ట్ వైల్డ్ డాగ్ అనే సినిమాతో రానున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారు సినిమాను లైన్ లో పెట్టనున్నాడు.

ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కూడా ఒక ప్రాజెక్టు సెట్ చేసుకునే పనిల్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో శివమణి, సూపర్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాలు కూడా నాగార్జునకి బాక్సాఫీస్ హిట్ ని అంధించాయి. ఇక 15 ఏళ్ల తరువాత మళ్ళీ అదే కాంబినేషన్ లో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా అనుష్క నటించనున్నట్లు రూమర్స్ కూడా వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











