Don't Miss!
- News భారత్‌లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్‌కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
డైరెక్టర్‌కి మాటిచ్చిన నాగార్జున.. రెమ్మునరేషన్ ఇవ్వనంటూ
Recommended Video
సీనియర్ హీరో నాగార్జున ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు ధీటైన పోటీ ఇస్తున్నారు. ఈ వయసులో కూడా యంగ్ లుక్‌లో దర్శనమిస్తూ నవ మన్మథుడిలా ముందుకు సాగుతున్నారు నాగ్. ప్రస్తుతం నాగార్జున హీరోగా మన్మథుడు 2 సినిమా రూపొందుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.
మన్మథడు 2 పూర్తికాగానే నాగార్జున చేయనున్న కొత్త సినిమా 'బంగార్రాజు'. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గాను కళ్యాణ్ కృష్ణకు ఎలాంటి పారితోషికం ఇవ్వనని చెప్పారట నాగ్. ఈ మేరకు సినిమాపై వచ్చిన లాభాల్లో వాటా ఇస్తానని ఆ దర్శకుడికి మాట ఇచ్చాడట. దీనికి కళ్యాణ్ కృష్ణ కూడా ఓకే చెప్పేశారని సమాచారం. అయితే ఇలా కొంతమంది దర్శకులు సినిమాల్లో వాటాలు తీసుకోవడం, మరి కొంతమంది దర్శకులు నిర్మాతలుగా మారడం చూసి టాలీవుడ్ లో ట్రెండ్ మారుతుందని అంటున్నారు విశ్లేషకులు.
మన్మథుడు 2 మరికొద్ది రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసుకోనుంది. ఇది కంప్లీట్ కాగానే వెంటనే బంగార్రాజు సెట్స్ పైకి వెళ్తారు నాగార్జున. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ లేదా నయనతార కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగార్జున కొడుకు నాగకే ఛైతన్య, కోడలు సమంత కూడా ఈ సినిమాలో భాగం కానుందం విశేషం. మరోవైపు నాగార్జున బిగ్ బాస్ హోస్టుగా కన్ఫర్మ్ అయ్యారు. ఇలా మరికొద్ది రోజుల్లోనే ఇటు బిగ్ బాస్, అటు బంగార్రాజు సినిమా సెట్స్ పై బిజీ కానున్నారు నాగ్.