twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్‌కి మాటిచ్చిన నాగార్జున.. రెమ్మునరేషన్ ఇవ్వనంటూ

    |

    Recommended Video

    Nagarjuna Condition To Bangarraju Director Kalyan Krishna || Filmibeat Telugu

    సీనియర్ హీరో నాగార్జున ఫుల్ జోష్‌లో ఉన్నారు. వరుస సినిమాలు చేస్తూ కుర్రహీరోలకు ధీటైన పోటీ ఇస్తున్నారు. ఈ వయసులో కూడా యంగ్ లుక్‌లో దర్శనమిస్తూ నవ మన్మథుడిలా ముందుకు సాగుతున్నారు నాగ్. ప్రస్తుతం నాగార్జున హీరోగా మన్మథుడు 2 సినిమా రూపొందుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

    మన్మథడు 2 పూర్తికాగానే నాగార్జున చేయనున్న కొత్త సినిమా 'బంగార్రాజు'. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించినందుకు గాను కళ్యాణ్ కృష్ణకు ఎలాంటి పారితోషికం ఇవ్వనని చెప్పారట నాగ్. ఈ మేరకు సినిమాపై వచ్చిన లాభాల్లో వాటా ఇస్తానని ఆ దర్శకుడికి మాట ఇచ్చాడట. దీనికి కళ్యాణ్ కృష్ణ కూడా ఓకే చెప్పేశారని సమాచారం. అయితే ఇలా కొంతమంది దర్శకులు సినిమాల్లో వాటాలు తీసుకోవడం, మరి కొంతమంది దర్శకులు నిర్మాతలుగా మారడం చూసి టాలీవుడ్ లో ట్రెండ్ మారుతుందని అంటున్నారు విశ్లేషకులు.

    Akkineni Nagarjuna Puts Condition to his Director

    మన్మథుడు 2 మరికొద్ది రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసుకోనుంది. ఇది కంప్లీట్ కాగానే వెంటనే బంగార్రాజు సెట్స్ పైకి వెళ్తారు నాగార్జున. ఈ సినిమాలో నాగార్జున సరసన రమ్యకృష్ణ లేదా నయనతార కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగార్జున కొడుకు నాగకే ఛైతన్య, కోడలు సమంత కూడా ఈ సినిమాలో భాగం కానుందం విశేషం. మరోవైపు నాగార్జున బిగ్ బాస్ హోస్టుగా కన్ఫర్మ్ అయ్యారు. ఇలా మరికొద్ది రోజుల్లోనే ఇటు బిగ్ బాస్, అటు బంగార్రాజు సినిమా సెట్స్ పై బిజీ కానున్నారు నాగ్.

    English summary
    Akkineni Nagarjuna presently busy with Manmathudu 2 movie which is directed by Rahul ravendran. After thi movie nagarjuna will act in Kalyan Krishna direction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X