రిస్క్ చేస్తున్న నాగార్జున.. ఆ సినిమా కోసం విదేశాలకు..
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున వెండితెరకు గ్యాప్ ఇచ్చి దాదాపు ఏడాది అవుతోంది. లాక్ డౌన్ కూడా ఆ గ్యాప్ ని ఇంకాస్త పెంచేసింది. ఈ ఏడాది నాగ్ సిల్వర్ స్క్రీన్ ని మిస్సయ్యేలానే కనిపిస్తున్నాడు అనే కామెంట్స్ గట్టిగానే వస్తున్నాయి. అయితే ఎలాగైనా వీలైనంత త్వరగా రావాలని నాగ్ నెక్స్ట్ సినిమాకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడు.
ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఒక కీలక షెడ్యూల్ ని విదేశాల్లో షూట్ చేయాలని అనుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ ముంబై నగరాల్లో కొన్ని సన్నివేశాలను షూట్ చేసినట్లు చెప్పిన దర్శకుడు సోలమన్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం తాయిలాండ్ వెళ్లబోతున్నారట. సరైన సమయం కోసం విదేశీ షెడ్యూల్ ప్లాన్ చేసుకోబోతున్నట్లు టాక్ వస్తోంది.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లడం అనేది చాలా కష్టంగా మారింది. కోవిడ్ 19 దేశవ్యాప్తంగా పెరుగుతుండడంతో సినీ తారలు కాలు బయటపెట్టడం లేదు. ఇక కొందరైతే షూటింగ్స్ కి చాలా దూరంగా ఉంటున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో నాగార్జున మాత్రం విదేశీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు అని టాక్ వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











