twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బంగార్రాజు ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: కోడలితో కలిసి నాగార్జున..!

    |

    కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా 'బంగార్రాజు' మూవీ రాబోతున్నట్లుగా చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ మూవీ సెట్స్ మీదకు మాత్రం రాలేదు. నాగార్జున సూపర్ హిట్ మూవీ 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని విన్నాం. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు ఆయన కొడుకు నాగచైతన్య కూడా భాగం కానున్నాడని వార్తలు రాగా.. లేటెస్ట్ సమాచారం మేరకు సమంత కూడా ఈ మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది.

    అక్కినేని ఫ్యాన్స్‌ సంబరపడేలా ఈ అప్‌డేట్ సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ పీఆర్ఓ చేప్పాడు. బంగార్రాజు చిత్రానికి సంబంధించి ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో స్క్రిప్ట్‌ ఫైనలైజేషన్ పనులు జరుగుతున్నట్లుగా ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించబోతుండగా, నాగచైతన్యకు జోడీగా సమంత నటించబోతోందని టాక్ బయటకొచ్చింది.

    Akkineni Nagarjunas Bangarraju Interesting Update

    మామ నాగార్జున, భర్త నాగ చైతన్యలతో కలిసి 'బంగార్రాజు' చిత్రంలో సమంత కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ ముగ్గురినీ సింగల్ ఫ్రేమ్‌లో చూడాలని కుతూహలపడుతున్నారు.

    ఇకపోతే ప్రస్తుతం నాగార్జున 'వైల్డ్‌ డాగ్‌' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న కారణంగా కళ్యాణ్‌ కృష్ణను ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసుకోమని చెప్పారట. ఆ మూవీ పూర్తికాగానే 'బంగార్రాజు' సెట్స్ పైకి వచ్చేస్తారట నాగ్.

    English summary
    Akkineni Nagarjuna new movie Bangarraju which is directed by Kalyan Krishna. As per latest informetion This movie shooting will starts after Nagarjuna's Wild Dog finish.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X