బంగార్రాజు అప్‌డేట్.. షూటింగ్ ప్రారంభమయ్యేది ఎప్పుడంటే!
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'బంగార్రాజు'. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు ఆయన కొడుకు నాగచైతన్య కూడా భాగం కానుండటం విశేషం. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబందించిన తాజా అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తిచేసిన కళ్యాణ్ కృష్ణ కురసాల ఇక సినిమాను నవంబర్ నెలలో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటినుంచి త్వరత్వరగా షూటింగ్ ఫినిష్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ఆయన ప్లాన్. తన గత సినిమా 'నేల టికెట్' ఆశించిన ఫలితం రాబట్టక పోవడంతో 'బంగార్రాజు' పై ప్రత్యేక శ్రద్ద తీసుకోనున్నారట డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల. మరోవైపు ఆఫీసర్, మన్మథుడు 2 రూపంలో వరుస పరాజయాలు చవిచూసిన నాగార్జునకు కూడా ఈ సినిమా కీలకం కానుంది.

ఈ చిత్రంలో నాగచైతన్య జోడీగా సమంత నటిస్తుందని ముందుగా వార్తలు వినిపించాయి. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం సమంత ప్లేస్‌లో కీర్తిసురేశ్ పేరు పరిశీలిస్తోందట చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. నాగార్జున సరసన రమ్యకృష్ణ లేదా నయనతార కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొన్నిరోజులు ఆగాల్సిందే మరి.


Click it and Unblock the Notifications











