కొడుకు సినిమాలో నటించలేకపోయిన నాగార్జున.. దర్శకుడి వల్లే..
అక్కినేని నాగార్జున ఎంత స్టార్ డమ్ వచ్చినా కూడా ఒకే తరహాలో ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. టాలీవుడ్ మన్మథుడిగానే కాకుండా బాక్సాఫీస్ కింగ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటూ వస్తున్నాడు. అలాగే స్టార్ డమ్ ను పక్కనపెట్టి అప్పుడప్పుడు చిన్న సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటాడు. గెస్ట్ రోల్స్ చేయడం కూడా మొదటి నుంచి అలవాటుగా వస్తున్నదే.
ఇక చాలా రోజుల అనంతరం నాగార్జునకు ఒక మంచి గెస్ట్ రోల్ లో నటించే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడి వల్ల చేయలేకపోయాడట. ఆ దర్శకుడు మరెవరో కాదు సురేంధర్ రెడ్డి అని తెలుస్తోంది. అఖిల్ 5వ సినిమా ఏజెంట్ ను డైరెక్ట్ చేస్తున్న ఈ దర్శకుడు ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎవరైనా సీనియర్ దర్శకుడిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడట. అయితే మొదట నాగార్జునను తీసుకునెందుకు చర్చలు జరిపినప్పటికి చివరికి సురేంధర్ రెడ్డి వలన ఆ ప్లాన్స్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం.

నాగార్జునను కాదని ఆ స్పెషల్ పాత్ర కోసం మలయాళం స్టార్ హీరో మమ్ముట్టిని తీసుకున్నారని కథనాలు అయితే గట్టిగానే వస్తున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు అగాల్సిందే. ఇక అఖిల్ ఈ సినిమాలో ఒక గూఢచారి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆ పాత్ర కోసం వర్కౌట్స్ చేసి ఫిట్నెస్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చేశాడు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. వచ్చే ఏడాది ఏజెంట్ ప్రేక్షకుల ముందుకు రావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











