తనయుడి కోసం మరో సీనియర్ దర్శకుడితో నాగ్ చర్చలు.. కరోనా నుంచి కోలుకోగానే..

అక్కినేని నాగార్జున తన సినిమాలతో ఎంత బిజిగా ఉన్నా కూడా కొడుకుల విషయంలో మాత్రం కొంచెం కూడా ఛాన్స్ తీసుకోరు. వీలైనంత వరకు వాళ్ళ కెరీర్ కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. ఒక విధంగా నాగ చైతన్య తన అనుభవంతో కొంత వరకు మంచి కథలు సెట్ చేసుకుంటున్నప్పటికి నాగ్ లైట్ తీసుకోవడం లేదని టాక్.

యుద్ధం శరణం సినిమా చైతు సొంత నిర్ణయంతో సెలెక్ట్ చేసుకొని ఒక్కసారిగా కెరీర్ డౌన్ అయ్యేలా చేసుకున్నాడు. మళ్ళీ అలాంటి సినిమాలు చేస్తాడనే భయంతో నాగార్జున ప్రతిసారీ కథల విషయంలో తన నిర్ణయం దాటి వెళ్లకూడదని విధంగా షరతులు విధించినట్లు అప్పట్లో రూమర్స్ అయితే వచ్చాయి. ఇక చిన్నవాడు అఖిల్ విషయంలో కూడా నాగ్ అలానే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్ ఇంకా బాక్సాఫీస్ వద్ద సరైన బోణి కొట్టలేదనే అసంతృప్తి అయితే ఉంది.

Akkineni nagarjuna story discussion with senior director

అందుకే ఎలాగైనా మంచి కథను సెట్ చేయాలని చూస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత సీనియర్ డైరెక్టర్ తేజతో సినిమా చేయాలని అఖిల్ కి నాగ్ వివరించినట్లు తెలుస్తోంది. గతంలో వీడియో కాల్ ద్వారా తేజ చెప్పిన ఒక కథను విన్న నాగ్ అఖిల్ కి సెట్టయ్యేలా కొన్ని మార్పులు చేయాలని కోరాడట. అయితే ఇంతలోనే తేజ కరోనా భారిన పడ్డారు. ఇక తేజ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత నాగార్జునకు అఖిల్ కి ఒకేసారి కథను వినిపించి ఓకే చేయించుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X