Samantha Ruth Prabhu: సమంతను కలుసుకోవాలని అక్కినేని హీరో ప్లాన్.. ఎందుకంటే?

సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి హీరోయిన్ గా గుర్తింపు అందుకుంటున్న సమంత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలియడంతో అభిమానులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. మయోసిటిస్‌ అనే ఒక వ్యాధితో ఇబ్బంది పడుతున్న సమంత ప్రస్తుతం చికిత్స తీసుకుంటూనే తన తదుపరి సినిమాలతో బిజీగా మారిపోయింది. అయితే ఇప్పటివరకు అక్కినేని నాగార్జున అక్కినేని నాగచైతన్య ఇద్దరు కూడా సమంత ఆరోగ్య విషయంపై సోషల్ మీడియాలో ఏ విధంగా స్పందించలేదు. అయితే ఆ త్వరలోనే అక్కినేని హీరో పర్సనల్ గా సమంతను కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

స్టార్ ఇమేజ్

స్టార్ ఇమేజ్

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును అందుకుంది. ఆ తర్వాత తమిళ చిత్ర పరిశ్రమంలో కూడా ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. తెలుగు తమిళంలో దాదాపు స్టార్ హీరోలందరితోనూ ఆమె సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అలాగే కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలతో కూడా సమంత తన క్రేజ్ మరింత పెంచుకుంది.

హిందీలో కూడా

హిందీలో కూడా

పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ద్వారా సమంత బాలీవుడ్ ఆడియన్స్ కు కూడా బాగా దగ్గరయిపోయింది. అంతకు ముందే ఆమె ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2లో అద్భుతమైన నటనతో నార్త్ ఆడియన్స్ ను ఎంతగానో అట్రాక్ట్ చేసింది. దీంతో హిందీలో కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వీలైనంతవరకు సమంత మంచి కంటెంట్ ఉన్న సినిమాలతోనే ఎక్కువగా ఆకట్టుకుంటోంది.

వ్యాధి తీవ్రత పెరగడంతో..

వ్యాధి తీవ్రత పెరగడంతో..

ఇక రీసెంట్ గా సమంత ఒకరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పడంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మయోసిటిస్‌ అనే వ్యాధి బారిన పడినట్లు సమంత సోషల్ మీడియాలో అధికారికంగా తెలియజేసింది. పూర్తిగా ఈ వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత అందరికీ ఆమె ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంది. కానీ ఇప్పుడు వ్యాధి తీవ్రత మరికొంత పెరగడంతో ఆమె అందరికీ తెలియజేసింది.

సమంత కోలుకోవాలని

సమంత కోలుకోవాలని

ఇక సమంత ఆ వ్యాధి నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలని మళ్లీ పూర్తిస్థాయిలో ఆరోగ్యంతో ఆమె షూటింగ్స్ లో పాల్గొనాలి అని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ అలాగే మరి కొంతమంది హీరోలు కూడా సమంత కోలుకోవాలని ట్వీట్ చేశారు. అక్కినేని హీరో అఖిల్ కూడా సమంత ఆరోగ్య విషయంపై స్పందించిన విషయం తెలిసిందే.

పర్సనల్ గా కలుసుకోవాలి అని..

పర్సనల్ గా కలుసుకోవాలి అని..

అయితే ఇప్పటివరకు సమంత మాజీ భర్త అక్కినేని నాగచైతన్య అలాగే అక్కినేని నాగార్జున స్పందించలేదు. కానీ వారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడినట్లుగా టాక్ వస్తోంది. ఇక అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పర్సనల్ గా వెళ్లి నాగార్జున కలవాలని అనుకుంటున్నట్లు సమాచారం. కుటుంబ పరంగా వారు విడిపోయినప్పటికీ కూడా వారి మధ్యలో మంచి సాన్నిహిత్యమైతే ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి నాగార్జున సమంత త్వరగా కోలుకోవాలని ఆమెను ప్రత్యేకంగా కలుసుకొని ధైర్యం చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే అధికారికంగా క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X