For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అఖిల్ సినిమాలో చేయి పెట్టిన నాగార్జున: ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే ఇది హిట్టేనట

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలలో చాలా మంది తమ వారసులను హీరోలుగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే, వారిలో కొందరు మాత్రమే తమ టాలెంట్లను చూపించి సక్సెస్ అయ్యారు. మరికొందరు మాత్రం ఇంకా విజయం కోసం పరితపిస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున చిన్న కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా ఎంటర్ అయిన అతడు.. ఇప్పటి వరకూ ఒక్క విజయాన్ని కూడా సొంతం చేసుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. దీంతో ఈ హ్యాండ్సమ్ హీరో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలన్న కసితో ఉన్నాడు.

    హాట్ హాట్‌గా రెచ్చిపోయిన మంచు లక్ష్మి: తొలిసారి అందాలన్నీ కనిపించేలా ఘాటు ఫోజులు

    చాలా కాలంగా సక్సెస్ కోసం వేచి చూస్తోన్న అక్కినేని అఖిల్.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. ఈ మూవీ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. కానీ, కరోనా రెండు లాక్‌డౌన్ల కారణంగా ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. దీనికి తోడు కొన్ని రీషూట్ల వల్ల ఇది మరింత లేట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఫస్ట్ కాపీ రెడీ అయింది. దీనిపై చిత్ర యూనిట్ సంతృప్తిగా ఉందట. దీంతో దీన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. ఇటీవలే సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు.

    Akkineni Nagarjuna Turns Editor for Most Eligible Bachelor

    క్రేజీ కాంబినేషన్‌లో ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీని అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. దానికి ఎంతో సమయం లేకపోవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ముమ్మరం చేసేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, పాటలు, టీజర్‌ను కూడా విడుదల చేసేసింది. ఈ క్రమంలోనే నాలుగు రోజుల క్రితమే థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆరంభం నుంచి రొమాంటిక్‌గా సాగిన ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది అత్యధిక వ్యూస్‌ను సైతం సొంతం చేసుకుంది.

    షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

    ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మూవీ గురించి తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ సినిమాతో తన కుమారుడు అక్కినేని అఖిల్‌కు బిగ్ హిట్ ఇవ్వాలని నాగార్జున పట్టుదలతో ఉన్నాడట. ఇందుకోసం ఏకంగా ఆయనే రంగంలోకి దిగి మరీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పర్యవేక్షించాడని తెలిసింది. అంతేకాదు, దీని కోసం ఎడిటర్‌గా మారి కొన్ని సీన్స్‌ను కూడా కత్తిరించాడనే టాక్ వినిపిస్తోంది. గతంలోనూ ఆయన పలు చిత్రాలకు ఇలాగే వ్యవహరించారు. అవన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు అఖిల్ మూవీ కూడా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు.

    'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో అఖిల్ రొమాంటిక్ రోల్‌లో నటించాడు. అతడికి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే చేసింది. ఈ సినిమాను అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీవాస్‌, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

    English summary
    Tollywood Young Hero Akhil Akkineni Did Most Eligible Bachelor Under Bommarillu Bhaskar. Akkineni Nagarjuna Turns Editor for This Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X