నాగార్జున బాలీవుడ్ రైడ్.. ఫిక్సయినట్లేనా..?
టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో, బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్ లో రీమేక్ అవుతుండటం సర్వసాధారణంగా మారింది. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలపై ఫోకస్ పెట్టి మరో భాషలో కూడా సూపర్ హిట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బాట లోనే హిందీలో సూపర్ హిట్ సాధించిన 'రైడ్' సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రీమేక్ సినిమాలో కింగ్ నాగార్జునను హీరోగా తీసుకోవాలనే సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం.
బాలీవుడ్ స్టార్ హెర్ప్ అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో 2018 సంవత్సరంలో విడుదలైన రైడ్ సినిమా నిర్మాతలకు లాభాల పంట పండించింది. దీంతో ఆ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనకు వచ్చారట తెలుగు నిర్మాతలు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్, ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మయించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ రీమేక్ లో లీడ్ రోల్ పోషించేందుకై నాగార్జునతో సంప్రదింపులు చేయాలని డిసైడ్ అయ్యారట.

ఇక ఇటీవలే మన్మథుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున.. ప్రస్తుతం బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్నారు. అదేవిధంగా కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో కొత్త సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు సీక్వల్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు ఆయన కొడుకు నాగచైతన్య కూడా భాగం కానుండటం విశేషం. దీంతో రైడ్ రీమేక్ విషయమై నాగార్జున ఎలా స్పందిస్తారు? ఒకవేళ ఓకే చెబితే ఎప్పుడు డేట్స్ ఇస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











