మరొక రీమేక్ కథలో సమంత.. ఎంత మంది వద్దంటున్నా అదే కావాలట!

అక్కినేని సమంత పెళ్లి తరువాత బిగ్ బడ్జెట్ సినిమాలకంటే కూడా ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాల్లోనే నటిస్తోంది. రంగస్థలం సినిమా తరువాత సమంత ఏం చేసినా కొత్తగా ఉండాలనే పట్టుదలతో కథలను ఎంచుకుంటోంది. అయితే సమంత ఈ మధ్య చేసిన కొన్ని రీమేక్ కథలు అంతగా క్లిక్కవ్వడం లేదు. ఓ బేబి రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ కథకు సమంత చేసిన దానికి చాలా తేడా ఉంది.

గతంలో ఈ బ్యూటీ పోటీపడి మరి కన్నడ యూ టర్న్ అనే సినిమా రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా ఏ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇక మొన్న తమిళ్ 96 రీమేక్ తో వచ్చిన సామ్ మరొక డిజాస్టర్ అందుకుంది. ఆ సినిమా మొదట చేయవద్దని అనుకున్నప్పటికి ఆ తరువాత ఎందుకో చేయక తప్పలేదట. ఇక ప్రస్తుతం అక్కినేని వారు కోడలు మరొక రీమేక్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుతెలుస్తోంది.

Akkineni Samantha planing for another kannada remake

కన్నడ హిట్ మూవీ డియా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లోకల్ ఆడియెన్స్ కి సినిమా కనెక్ట్ కావడంతో సమంత ఆ సినిమాను సొంతంగా రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తోందట. అయితే ఆ సినిమా నీకు సెట్టవ్వదని చాలామంది చెబుతున్నప్పటికీ సమంత వినడం లేదట. అదే కథ కావాలని పెద్దగా మార్పులు చేయకుండా సినిమాను తెరకెక్కించడానికి పట్టుబట్టి కూర్చుందట. ప్రస్తుతం కొంతమంది యువ దర్శకులతో 'డియా' తెలుగు స్క్రిప్ట్ పై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X