రష్మికలో తన ఫేవరెట్ హీరోయిన్ ను చూసుకుంటున్న నాాగార్జున.. ఎవరో తెలుసా?
టాలీవుడ్ స్టార్ నటుడు, సీనియర్ హీరో, కింగ్ అక్కినేని నాగార్జున మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. చివరిగా నాగ్ నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో తన రాబోయే చిత్రాలపై మరింత శ్రద్ధ పెట్టారు. ఇక తను హీరోగానే కాకుండా కీలక పాత్రల్లోనూ నటించేందుకు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో మళ్లీ కెరీయర్ ను గాడీలో పెడుతున్నారు. ప్రస్తుతం అక్కినేని అభిమానులను 'కుబేరా' చిత్రంతో అలరిస్తున్నారు. ఈ చిత్రంలోని నాగార్జున పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే సినిమా కూడా సక్సెస్ అవ్వడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక తెలుగు లో రూపుదిద్దుకున్న చిత్రం కావడంతో నాగార్జునకు మరింత పేరు దక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ మీట్లలో నాగార్జున సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా రష్మిక మందన్నపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ ను ఆమెలో చూశానని చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కుబేరా చిత్రం విశేషాలు..
జూన్ 20న కుబేరా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. బిచ్చగాడి అవతారం ఎత్తి బాక్సాఫీస్ వద్ద రఫాడిస్తున్నారు. ఇక ఇదే చిత్రంలో అక్కినేని నాగార్జున దీపక్ అనే పాత్రలో మాజీ సీబీఐ ఆఫీసర్ గా కనిపించారు. మరోవైపు సమీరా అనే ఇంట్రెస్టింగ్ పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న చక్కగా అలరించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ఎల్పీ, అమిగోస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లలో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రూ.120 కోట్లతో గ్రాండ్ గా నిర్మించారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్లను సాధిస్తోంది. 3 రోజుల్లో రూ.100 కోట్లకు చేరువలో ఉండటం విశేషం.

సక్సెస్ మీట్ లో రష్మిక మందన్నపై ప్రశంసలు..
కుబేరా చిత్రం విజయవంతం అవ్వడంతో టీమ్ సక్సెస్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరై టీమ్ ను అభినందించారు. ఇక అక్కినేని నాగార్జున మాట్లాడుతూ రష్మిక మందన్నపై ప్రశంసలు కురిపించారు.'రష్మిక మందన్నతో కుబేరా చిత్రంలో నటించాక నాకు శ్రీదేవి గుర్తుకొచ్చింది. అది కూడా క్షణక్షణం చిత్రంలో శ్రీదేవీని చూసినట్టుగా ఉంది. నీలో శ్రీదేవిని చూశాను. నువ్వు నేషనల్ క్రష్ ఎప్పుడయ్యావో నాకు తెలియదు కానీ. ఇప్పుడు మాత్రం నా క్రష్ గా మారిపోయావు.' అని చెప్పకొచ్చారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే చెరగని ముద్ర వేసుకున్న గొప్ప నటి శ్రీదేవితో తనను పోల్చడంతో రష్మిక మందన్న కూడా ఉప్పొంగిపోయింది.
శ్రీదేవితో అక్కినేని నాగార్జున సినిమాలివే..
రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఆఖరి పోరాటం, డాషింగ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణ క్షణం వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఇక 1991లో క్షణ క్షణం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి గాను శ్రీదేవికి ఫిల్మ్ ఫేయిర్ అవార్డు దక్కింది. ఇక ఉత్తమ దర్శకత్వం, స్క్రీన్ ప్లే విభాగంలో రామ్ గోపాల్ వర్మకు ఐదు నంది అవార్డులు అందాయి. ఇక శ్రీదేవి నాగార్జున కలిసి హిందీతో కుదా గవా, మిస్టర్ బెచారా వంటి హిందీ చిత్రాల్లోనూ కలిసి నటించడం విశేషం.
నాగార్జున రాబోయే చిత్రాలు..
నాగార్జున ఇప్పటి వరకు తన కెరీయర్ లో 99 చిత్రాల్లో నటించారు. చివరిగా నా సామీ రంగ చిత్రంతో హిట్ అందుకున్నారు. ఇక తన 100వ చిత్రం అనౌన్స్ మెంట్ పనిలో బిజీగా ఉన్నారు. ఇదే క్రమంలో కుబేరా చిత్రంలో కీలక పాత్రతో అలరిస్తున్నారు. మరోవైపు తమిళంలో రూపుదిద్దుకుంటున్న రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ చిత్రం కూలిలో కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం 2025 ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











