మహేష్ సరసన బెంగుళూరు బ్యూటీ

By Srikanya

సుకుమార్,మహేష్ బాబు కాంబినేషన్ ఓ చిత్రం ఆ మధ్యన ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రంలో హీరోయిన్ ఎంపిక మాత్రం జరగలేదు. ప్రస్తుతం బెంగుళూరుకి చెందిన అక్షర గౌడ అనే మోడల్ ని ఆ పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో క్రికెటర్ యువరాజ్ తో లింక్ లు ఉన్నాయంటూ ప్రచారమైన ఈ ముద్దుగుమ్మపై రీసెంట్ గా ఫోటో షూట్ ని సుకుమార్ ఆఫీసులో జరిపినట్లు తెలుస్తోంది. ఆమె ఈ ఆఫర్ పై చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఇదే తనకు టాలీవుడ్ లో రైట్ ఆపర్చునిటి అని భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రం ఓ థ్రిల్లర్ అని,మార్చి నుంచి షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఇక అక్షర ప్రస్తుతం మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తుపాకి చిత్రంలో చేస్తోంది. హిందీలోనూ జిందగీ నా మిలేగీ దోబరా చిత్రంలో చేసింది. అలాగే మొదట సుకుమార్ ప్రక్కన ఈ పాత్రకు తమన్నాను అనుకున్నారు కానీ డేట్స్ ఇష్యూతో ఆగిపోయింది. ఈ చిత్రంలో మహేష్ బాబు లెక్చరర్ పాత్రలో కనపించనున్నారని చెప్తున్నారు. దూకుడు నిర్మించిన నిర్మాతలే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ ..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం షూటింగ్ లో ఉన్నారు. అడ్డాల శ్రీకాంత్ డైరక్టర్ గా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X