అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్.. కన్నప్ప చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకున్నారంటే?
బాలీవుడ్ స్టార్ హీరో తొలిసారిగా టాలీవుడ్ లో నటించిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో అలరించారు. కేవలం సినిమాలో కీలక పాత్ర పోషించడమే కాకుండా హిందీ బెల్ట్ లో సినిమాను గట్టిగానే ప్రమోషన్ కూడా చేశారు. ఈ చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించడం విశేషం. అయితే అక్షయ్ కుమార్ కన్నప్ప చిత్రానికి ఎన్ని కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
కన్నప్ప చిత్రానికి అక్షయ్ కుమార్ ప్రమోషన్..
మంచు విష్ణు ఫ్యామిలీలోనే తొలిసారిగా భారీ బడ్జెట్ తో కన్నప్ప చిత్రం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు చేయడం విశేషం. స్టార్ కాస్ట్స్, న్యూజీలాండ్ లో షూటింగ్ చేయడం, టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేయడంతో భారీగానే ఖర్చైంది. అలాగే భారీ స్థాయిలో ఈ సినిమాను ప్రమోట్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ గా విడుదలైంది. అయితే హిందీలో కన్నప్ప చిత్రాన్ని పూర్తిగా ప్రమోట్ చేసింది అక్షయ్ కుమార్ కావడం విశేషం. తన సినిమాగానే కన్నప్ప సినిమాకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈవెంట్లలోనూ పాల్గొని సినిమాపై మరింత అంచనాలను పెంచేశారు.

అక్షయ్ కుమార్ పారితోషికం..
అయితే ఈ చిత్రంలో భారీ కాస్ట్ నటించడం సినిమాకు ఎంతో లాభాన్ని చేకూర్చింది. కాగా కన్నప్ప చిత్రంలో నటించినందుకు గానూ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారంట. కేవలం 4 రోజులు షూటింగ్ లో పాల్గొన్నందుకు మొత్తంగా రూ.6 కోట్ల వరకు చార్జ్ చేశారంట. అంటే రోజుకు రూ.1.5 కోట్లు కావడం విశేషం. దీంతో అక్షయ్ కుమార్ రోజుకు కోటి సంపాదించడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈమేరకు ప్రచారం జరుగుతోంది.
ఒక్క సినిమాకు అక్షయ్ కుమార్ రెమ్యునరేషన్..
ప్రస్తుతం బాలీవుడ్ లో సీనియర్ హీరోగా అక్షయ్ కుమార్ హిందీ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. ఆరు పదుల వయస్సుకు దగ్గరవుతున్నా కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు తీస్తున్నారు. రీసెంట్ గా హౌజ్ ఫుల్ 5 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దుమ్ములేపారు. అయితే అక్షయ్ కుమార్ ఒక్కో చిత్రానికి రూ.60 నుంచి రూ.135 కోట్ల వరకు ఛార్జీ చేస్తున్నారు. ఇటీవల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్స్ ను కూడా డిమాండ్ చేస్తుండటం విశేషం.
కన్నప్ప సినిమా బాక్సాఫీస్ వసూళ్లు..
కన్నప్ప చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. తొలిరోజే ఈ చిత్రానికి రూ.13 కోట్ల వరకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ దక్కడం విశేషం.ఇక మరుసటి రోజు నుంచి రోజు రూ.10 కోట్ల వరకు వసూళ్లు అందుకుంటూ వస్తున్నారు. 5వ రోజు వరకు ఈ చిత్రానికి రూ.50కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications











