twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్‌తో పోటీ పడుతున్న రాజమౌళి స్టోరీ

    By Bojja Kumar
    |

    రవితేజ-అనుష్క జంటగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'విక్రమార్కుడు' తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఈ సినియాలో రవితేజా ద్విపాత్రాభినయం చేశారు. ఈ రెండు పాత్రల్ని వైవిధ్యభరితంగా మలిచి, అటు యాక్షన్ సీన్లను ... ఇటు కామెడి - సెంటిమెంట్ సన్నివేశాల్ని రాజమౌళి అద్భుతంగా ఆవిష్కరించాడు.

    తాజాగా విక్రమార్కుడు సినిమా...హిందీలో 'రౌడీ రాథోర్' గా రీమేక్ చేస్తున్న. హీఅక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలాబన్సాలి నిర్మిస్తుండగా, ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. జూన్ 15 న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    రౌడీ రాథోర్ సినిమా విడుదలకు ముందు బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ రూ. 35 కోట్లు పలికాయని బాలీవుడ్ సమాచారం. అమీర్ ఖాన్ హీరోగా చేసిన 'తలాష్'చిత్రం శాటిలైట్ రైట్స్ తో ఈ సినిమా పోటీ పడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొన్ని రోజుల క్రితం సల్మాన్ నటించబోయే దబాంగ్2 చిత్రం విడుదలకు ముందే శాటిలైట్ రైట్స్ అత్యధికంగా రూ. 50 కోట్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు రౌడీ రాథోడ్ సినిమా దానికి చేరువడం గమనార్హం.

    ప్రస్తుతం రాజమౌళి తెలుగులో 'ఈగ' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ సాంకేతిక విలువలతో రూపొందుతోన్న ఈ చిత్రం విజువల్ వండర్గా నిలవబోతోందని అంటున్నారు. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    It seems that actor Akshay Kumar is all set to rule the roost in Bollywood. Akshay's upcoming movie Rowdy Rathore has spelled its magic even long before the release. Reportedly, the film's satellite rights have been sold for 35 crore.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X