గబ్బర్ కు ఫైనాన్సియల్ సమస్యలు

By Srikanya

హైదరాబాద్ : సినిమాలకి ఫైనాన్స్ అనేది ప్రాణం లాంటిది. పూర్తి డబ్బు ఉన్నా చాలా సార్లు ఫైనాన్స్ తెచ్చే సినిమా పూర్తి చేసి బిజినెస్ చేసి దాన్ని తిరిగి ఇస్తూండటం కామన్. దర్శక,నిర్మాతల గత సినిమాల చరిత్రను బట్టి ఈ ఫైనాన్స్ లు దొరుకుతూంటారు. అయితే ఫైనాన్స్ లు క్లియర్ చేయిందే మాత్రం సినిమాను రిలీజ్ కానివ్వరు. చాలా సార్లు చాలా సినిమాలు ఇలా రిలీజ్ రోజు ఫైనాన్సియర్స్ అడ్డు పెట్టడంతో ఆగిపోయిన ఘటనలు సైతం ఉన్నాయి. పెద్ద సినిమాలకు,పెద్ద నిర్మాతలకు ఇటువంటి పరిస్ధితి ఒక్కోసారి తప్పదు. తాజాగా అలాంటి పరిస్ధితిని అక్షయ్ కుమార్ చిత్రం ఎదుర్కొంటోందని బాలీవుడ్ మీడియా అంటోంది.

చిరంజీవి 'ఠాగూర్' సినిమాను బాలీవుడ్ లో గబ్బర్ గా తెరకెక్కిస్తూ బాలీవుడ్ లోకి జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్) అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పాత్రను అక్షయ్ కపూర్ పోషిస్తున్నారు. ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలి మరియు 18మోషన్ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సమాచారం ప్రకారం ఈ సినిమా 2014 చివర్లో విడుదల అవుతుందని అంచనా వేసారు. అయితే ఆ పరిస్ధితి కనపడటం లేదు. ఈ చిత్రం ప్రస్తుతం ఫైనాన్సియల్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు బాలీవుడ్ సమాచారం.

తన విధ్యార్ధులతో కలిసి లంచం తీసుకుంటున్న వాళ్ళని మట్టికరిపిస్తూ వుండే ఉపాధ్యాయపాత్రలో హీరో కనిపిస్తాడు. ఈ పాత్రకోసం చాలా రోజులుగా అక్షయ్ కష్టపడ్డాడు. క్రిష్ కి ఇది పెద్ద ప్రొజెక్ట్. ఇప్పటివరకూ క్రిష్ ‘గమ్యం', ‘వేదం', ‘కృష్ణంవందే జగద్గురుం' సినిమాలు తీశాడు. స్టార్ల విషయం, బడ్జెట్ విషయం లెక్కిస్తే క్రిష్ కు ఇదే పెద్ద ప్రొజెక్ట్ కానుంది.

ఇక ‘గబ్బర్' సినిమాలో సుమన్ విలన్ గా కనిపించనున్నాడు. సుమన్ తనకు వచ్చిన బాలీవుడ్ ఆఫర్ గురించి మాట్లాడుతూ ‘ ‘శివాజీ' సినిమా చూసిన తర్వాత అక్షయ్ కుమార్ తన ఎత్తుకి, పర్సనాలిటీకి నేనైతే బాగుంటానని అక్షయ్ చెప్పడంతో క్రిష్ నెగటివ్ షేడ్స్ ఉన్న పొలిటీషియన్ పాత్రలో నేను బాగుంటానని ‘గబ్బర్' మూవీకి సెలక్ట్ చేసారని' సుమన్ అన్నాడు.

Akshay Kumar's Gabbar Landed in Financial Troubles

దర్శకుడు క్రిష్ విషయానికి వస్తే...

'గబ్బర్' తర్వాత క్రిష్ తెలుగులో నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తో చిత్రం ప్లాన్ చేస్తు్న్నారు. క్రిష్ అభిరుచికి తగ్గట్టుగా, నటునిగా వరుణ్‌తేజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లే రీతిలో ఉండే కథాంశాన్ని క్రిష్ సిద్ధం చేస్తున్నట్లు వినికిడి. క్రిష్ సొంత నిర్మాణ సంస్థ 'ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్'పై ఈ చిత్రం రూపొందనుందనీ, 'ముకుందా' తర్వాత వరుణ్ చేస్తున్న చిత్రం ఇదని చెప్తున్నారు.

మకో ప్రక్క క్రిష్ త్వరలో నిర్మాతగా మారుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో విజయవంతమైన సైవం చిత్రాన్ని తెలుగులో ఆయన రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఓ వెరైటి టైటిల్ అదీ తెలుగుతనం ఉట్టిపడే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం. బాలీవుడ్‌లో గబ్బర్ చిత్ర షూటింగ్‌ని పూర్తిచేసిన దర్శకుడు క్రిష్ సైవం రీమేక్‌ని ఉషాకిరణ్ మూవీస్‌తో కలిసి నిర్మించబోతున్నాడని తెలిసింది. త్వరలో సెట్స్‌పైకి రానున్న ఈ చిత్రానికి దాగుడుమూతలు దండాకోరు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు చిత్ర వర్గాల సమాచారం.

ఈ చిత్రానికి దర్శకుడెవరు? నటీనటులెవరు? అనే విషయాల్ని చిత్ర వర్గాలు త్వరలో వెల్లడించనున్నాయని తెలిసింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ హీరోగా గబ్బర్ చిత్రాన్ని రూపొందించి తన తదుపరి చిత్రం నాగబాబు కుమారుడుతో చేయటానికి సిద్దంగా ఉన్నారు. తమిళంలో నాన్న డైరక్టర్ విజయ్ రూపొందించిన ‘శైవం'కి ఇది రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రం చూసిన క్రిష్...బాగా నచ్చి రామోజీరావు గారికి ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. రామోజీరావు గారు సైతం ఈ చిత్రం చూసి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X