స్టార్ హీరో సరసన 'అలా మొదలైంది' నిత్యామీనన్ కన్ఫర్మ్
అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ ప్రాపర్టీగా మారింది. తాజాగా స్టార్ హీరో వెంకటేష్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. అలా మొదలైంది చిత్రం చూసిన త్రివిక్రమ్ వెంటనే ఆమెను ఓకే చేసారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్.గోపాల్ రెడ్డి కెమెరామెన్ గా చేయనున్నారు. త్రివిక్రమ్ తొలిసారిగా గోపాలరెడ్డితో పనిచేయనున్నారు. అలాగే ఫుల్ డిమాండ్ లో ఉన్న తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం యూనవర్శిల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తారు. ఈ చిత్రం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఇక త్రివిక్రమ్ , వెంకటేష్ కాంబినేషన్ లో గతంలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలు వచ్చి హిట్టయ్యాయి. అయితే అప్పుడు రైటర్ గా త్రివిక్రమ్ ఆ చిత్రాలకు పనిచేసారు. త్రివిక్రమ్ దర్శకుడుగా, వెంకటేష్ తో చిత్రం అనగానే మార్కెట్ లో మంచి క్రేజ్ వచ్చింది.


Click it and Unblock the Notifications











