'అల.. వైకుంఠపురములో' ఎఫెక్ట్: దర్శకనిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న అల్లు అర్జున్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' రూపంలో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అల్లు అర్జున్- పూజా కెమిస్ట్రీ, డైరెక్టర్ టేకింగ్, మూవీ సబ్జెట్, తమన్ సంగీతం అన్నీ ప్లస్ అయి బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీగా 'అల.. వైకుంఠపురములో' రికార్డు సృష్టించింది.
ఈ జోష్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. తన రెమ్మ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేశారట. ఈ ఫిగర్ చూసి దర్శకనిర్మాతలకు చుక్కలు కనిపిస్తున్నాయట. ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. 'అల.. వైకుంఠపురములో' కంటే ముందు 15 కోట్లు తీసుకున్న బన్నీ, ఇప్పుడు అంతకు రెట్టింపు కావాలని డిమాండ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయనిలా పారితోషికాన్ని పెంచేయడానికి కారణం 'అల వైకుంఠపురములో' సాధించిన వసూళ్లే అనే టాక్ వినబడుతోంది.

ఇకపోతే ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాలో నటిస్తున్నారు అల్లు అర్జున్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుంది. చూడాలి మరి తన రెమ్మ్యూనరేషన్ విషయమై వస్తున్న వార్తలపై అల్లు అర్జున్ స్పందిస్తాడా? లేదా? అనేది.


Click it and Unblock the Notifications











