'అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆ రోజే ఫిక్స్!
త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ క్రేజీ కాంబోలో రూపొందిన 'అల వైకుంఠపురములో' మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల నడుమ జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ మేరకు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్‌డేట్స్ భారీ హైప్ క్రియేట్ చేశాయి.
ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా చేయాలని ఫిక్స్ అయిందట చిత్రయూనిట్. ఈ మేరకు జనవరి 6వ తేదీని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు, అశేష అభిమానుల సమక్షంలో హైదరాబాదులోనే ఈ వేడుకను నిర్వహించాలని డిసైడ్ అయ్యారట. అంతేకాదు ఈ వేడుకకు ఓ సర్‌ప్రైజింగ్ గెస్ట్‌ను కూడా ఆహ్వానించారట. మరో రెండు మూడు రోజుల్లో వేదిక వివరాలు, గెస్ట్ పేరు ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ''సామజవరాగమన, రాములో రాములా'' పాటలు రికార్డుల సునామీ సృష్టిస్తూ 'అల.. వైకుంఠపురములో' స్థాయిని తెలియజేశాయి. థమన్ అందించిన బాణీలకు ఫిదా అయింది ప్రేక్షకలోకం. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్ర పోషిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగినట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











