అల్లు అర్జున్ డిసైడ్.. అస్సలు తగ్గేదే లేదని అంటున్నారట! ఇదీ క్లారిటీ..
అల్లు అర్జున్ తాజా సినిమా 'అల.. వైకుంఠపురములో' సినిమాపై రకరకాల రూమర్స్ వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినిమా విడుదల విషయమై బన్నీ అభిమానుల్లో టెన్షన్ పెట్టే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందిన సమాచారం మేరకు అల్లు అర్జున్ ఓ డిసీజన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విడుదలై ఆయన చాలా క్లారిటీగా ఉన్నారట. వివరాల్లోకి పోతే..

అల వైకుంఠపురములో రిలీజ్ డేట్.. హాట్ ఇష్యూ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందింది. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో గత రెండు మూడు రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది.

చాలా క్లారిటీగా ఉన్న అల్లు అర్జున్
ముందుగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 'అల వైకుంఠపురములో' సినిమా రిలీజ్ డేట్ ప్రీ పోన్ చేశారని, అనుకున్న దానికంటే రెండు రోజులు ముందుగానే అనగా జనవరి 10వ తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి. ఇలా ఎన్ని వార్తలొచ్చినా ఈ ఇష్యూపై అల్లు అర్జున్ చాలా క్లారిటీగా ఉన్నట్లు సమాచారం.

ఇంతటితో ఫుల్‌స్టాప్.. ఇకపై
తన 'అల వైకుంఠపురములో' సినిమాను ముందుగా చెప్పిన తేదీ జనవరి 12నే విడుదల చేయాలని బన్నీ ఫిక్స్ అయ్యారట. సంక్రాంతి కానుకగా ఎలాంటి మార్పులు లేకుండా అనుకున్న సమయానికే సినిమా ప్రేక్షకుల ముందుంచాలని ఆయన డిసైడ్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సో.. ఇక 'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఇష్యూకి ఇంతటితో ఫుల్‌స్టాప్ పడ్డట్లే మరి.

'అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్
మరోవైపు 'అల వైకుంఠపురములో' ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది చిత్రయూనిట్. జనవరి 6న సాయంత్రం 5 గంటలకు యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను ఖరారు చేశారు. వైభవంగా, వినూత్నంగా జరగనున్న ఈవెంట్‌కి మ్యూజికల్ కాన్సర్ట్ అని నామకరణం చేయడం విశేషం.

'అల వైకుంఠపురములో' మూవీ
గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందిన 'అల వైకుంఠపురములో' సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అల్లు అర్జున్ కెరీర్‌లో 19వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది.


Click it and Unblock the Notifications











