కాపీ కొట్టారా? అల.. వైకుంఠపురములో అదే జరిగిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా 'అలా.. వైకుంఠపురములో'. ఈ మూవీ ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పైగా బన్నీ గత సినిమా డిసాస్టర్ కావడంతో ఈ సినిమాపై ఎలాగైనా హిట్ కావాలని ఆశగా ఉన్నారు ఆయన ఫ్యాన్స్.

ప్రస్తుతం సినిమా షూటింగ్ చేస్తూనే.. ప్రమోషన్స్ కూడా చేపడుతోంది చిత్రయూనిట్. ఈ మేరకు ఫస్ట్‌లుక్ మొదలుకొని.. చిత్రంలోని రెండు పాటలను కూడా విడుదల చేశారు. అందులో మొదటి సాంగ్ సామజవరాగమనా కాగా రెండోది రాములో రాములా. ఈ రెండు పాటలు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన తెచ్చుకున్నాయి. కానీ ఇంతలో ఈ రెండు పాటలు కాపీ అనే టాక్ వస్తుండటం బన్నీ అభిమానవర్గాలను కలవరపెడుతోంది.

Ala Vaikunthapurramloo Songs Copy Issue Viral On Social media

మొదటి సాంగ్ 'సామజవరాగమనా'తో పాటు రెండో పాట 'రాములో రాములా' కూడా వేరే ప్రైవేట్ సాంగ్స్ ట్యూన్స్ పోలి ఉన్నాయని, ప్రైవేట్ సాంగ్స్ ట్యూన్స్ కాపీ కొట్టి తమన్ మ్యూజిక్ అందించారని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టులు షికారు చేస్తున్నాయి. ఈ మేరకు ప్రైవేట్ సాంగ్స్, ఈ 'రాములో రాములా' కంపేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. దీంతో ఈ ఇష్యూ హాట్ హాట్ చర్చలకు దారితీస్తోంది. చూడాలి మరి దీనిపై త్రివిక్రమ్ గానీ, తమన్ గానీ స్పందిస్తారా? లేక లైట్ తీసుకుంటారా? అనేది.

'అలా.. వైకుంఠపురములో' సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అదే రోజు మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కూడా విడుదల కానుండటం ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X