‘అల.. వైకుంఠపురములో’ హిందీ రీమేక్.. రెడీ అయిన స్టార్ హీరో!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన 'అల.. వైకుంఠపురములో' సినిమా టాలీవుడ్‌లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. సంక్రాంతి రేస్‌లో నిలిచిన ఈ మూవీ.. ఈ ఏడాదికి కిక్ స్టార్ట్ ఇస్తూ పండగ విన్నర్‌గా నిలిచింది.

ఇప్పటికే 150 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ సినిమా పలు రికార్డులు తిరగరాస్తూ పరుగులు పెడుతోంది. తెలుగులో ఇంతటి బ్లాక్‌బస్టర్ సాధించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా లేటెస్ట్ సమాచారం. 'అల.. వైకుంఠపురములో' రీమేక్ రైట్స్‌ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత 8 కోట్ల రూపాయలకు కైవసం చేసుకున్నాడు.

Ala vaikunthapurramuloo hindi remake: Hero Fix

అయితే ఇటీవలే 'అల వైకుంఠపురములో' మూవీ చూసిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బాగా ఇంప్రెస్ అయ్యారట. ఈ మేరకు ఈ సినిమాను హిందీ రీమేక్ లో తాను చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సరైన హిట్ పడక సతమతమవుతున్న సల్మాన్.. ఈ రీమేక్ ద్వారా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అనుకుంటున్నాడట.

కాగా 'అల.. వైకుంఠపురములో' హిందీ రీమేక్ అచ్చం తెలుగు వర్షన్‌లా కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మొత్తానికి టాలీవుడ్ ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసిన 'అల.. వైకుంఠపురములో' బాలీవుడ్ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X