twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘అల’ వేడుకలు రద్దు.. వాటికి దూరంగా ఉండాలని బన్నీ ఫిక్స్

    |

    స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అల వైకుంఠపురములో ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొడుతూ దూసుకుపోతోంది. బన్నీ కెరీర్‌లోనే మొట్టమొదటి రూ.200కోట్ల చిత్రంగా హయ్యస్ట్ కలెక్షన్లను రాబడుతూ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే అంతా బాగుందని అనుకునే తరుణంలో అల్లు వారి కుటుంబంలో విషాదం నెలకొనడంతో.. సంబరాలన్నీ ఆవిరయ్యాయి.

    అల్లు అర్జున్ మేనమామ మరణం..

    అల్లు అర్జున్ మేనమామ మరణం..

    అల్లు అర్జున్ తల్లి నిర్మల దేవి పెద్దన్న .. అల్లు అర్జున్‌కి వరుసకు మామ అయిన ముత్తంశెట్టి ప్రసాద్ హఠాన్మరణం చెందారు. హార్ట్ అటాక్ కారణంగా ఆయన విజయవాడలో మృతి చెందారు. ఈ విషయం తెలిసి విజయానందంలో ఉన్న అల్లు ఫ్యామిలీ ఒక్కసారిగా షాక్ అయింది.

     విజయవాడలో అల్లు ఫ్యామిలీ..

    విజయవాడలో అల్లు ఫ్యామిలీ..

    ముత్తంశెట్టి మరణవార్త విన్న అల్లు ఫ్యామిలీ హుటాహుటిన విజయవాడకు చేరుకుంది. ముత్తం శెట్టి అంతిమ కార్యక్రమాల్లో పాల్గొంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు ఫ్యామిలీ మొత్తం విజయవాడలోనే ఉండబోతోందని తెలుస్తోంది.

     వేడుకలకు దూరంగా..

    వేడుకలకు దూరంగా..

    అల వైకుంఠపురములో రూపంలో కెరీర్‌లో బిగ్గెస్ట్ సక్సెస్ వచ్చిందని సంతోషిస్తున్న టైమ్ లో ఈ ఘటన ఆ కుటుంబానికి శోకాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో అల్లు ఫ్యామిలీ ఇకపై అల విజయోత్సవ వేడుకలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్లు టాక్.

     తిరుపతి ఈవెంట్ రద్దు..

    తిరుపతి ఈవెంట్ రద్దు..

    వైజాగ్‌లో ఆదివారం జరిగిన సక్సెస్ సెలెబ్రేషన్ ఏ రేంజ్‌లో వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సక్సెస్ టూర్‌లో భాగంగా తిరుపతి, కర్ణాటక, కేరళలో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేశారు. అయితే అనుకోని ఈ ఘటనతో సక్సెస్ సెలెబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని ఫిక్స్ అయిన బన్నీ.. తిరుపతి ఈవెంట్‌ను రద్దు చేసినట్టు తెలుస్తోంది.

    English summary
    Ala Vaikunthapurramuloo Success Celebrations At Tirupati Is Cancelled. Mutthamshetty Rajendra prasad Who Is Relative To Allu Arjun Is Passed Away.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X