బిగ్‌బాస్ కాదు.. ఏకంగా ఆ హీరో పక్కన హీరోయిన్‌గా.. పచ్చళ్ల పాప దశ తిరిగిందిగా!

కొద్దిరోజుల క్రితం అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ వివాదాన్ని బేస్ చేసుకుని రీల్స్, వీడియోలు, ఫన్నీ స్పూఫ్స్‌‌తో ఇంటర్నెట్ కొద్దిరోజులు హోరెత్తిపోయింది. నేటికీ అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం తెలుగునాట హాట్ టాపిక్కే. ఈ వివాదంతో అలేఖ్య చిట్టి సిస్టర్స్‌కు మాత్రం బోల్డెంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. చివరికి సినిమా వాళ్లు కూడా ఈ వివాదాన్ని తమ ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. వీరికి ఖచ్చితంగా బిగ్‌బాస్‌లో ఛాన్స్ గ్యారెంటీ అని అంతా అనుకున్నారు. కానీ అంతకుమించి ఆఫర్ పట్టేసింది అలేఖ్య సిస్టర్. ఈ వివరాల్లోకి వెళితే..

పచ్చళ్ల బిజినెస్‌తో అలేఖ్య సిస్టర్స్ ఫేమస్

రాజమండ్రికి చెందిన సుమ, అలేఖ్య, రమ్య కంచర్ల. వీరు ముగ్గురు కలిసి చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఇలా నాన్ వెజ్‌తో చేసే పచ్చళ్లు చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. అంతకంటే ముందే వీరిలో చిన్నమ్మాయి రమ్య సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా బాగా ఫేమస్. హాట్ హాట్ ఫోటోషూట్‌లు, రీల్స్‌తో ఈ అమ్మాయి సెగలు రేపేది. అలా ఓ రోజున పచ్చళ్ల వ్యాపారం గురించి బయటపెట్టి తన ఫాలోవర్స్‌ను కస్టమర్స్‌గా మార్చేసింది. పికెల్స్ తయారీ, కలిపే విధానానికి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఈ అక్కాచెల్లెళ్లు తమ వ్యాపారాన్ని పెంచుకున్నారు. అంతా సజావుగా సాగుతున్న దశలో ఓ కస్టమర్‌తో ఆన్‌లైన్‌లో చేసిన డిస్కషన్ వీరి వ్యాపారాన్ని దెబ్బకొట్టింది.

alekhya chitti pickles sister ramya gopal kancharla at vachina vaadu gowtham event

కస్టమర్‌తో అసభ్య ప్రవర్తన

పచ్చళ్ల రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయని అందరికీ అందుబాటు ధరల్లో ఉంచాలని అడిగినందుకు పచ్చళ్లే కొనలేని వాడివి రేపు భార్యకు బంగారం ఏం కొంటావ్ అంటూ అసభ్యంగా మాట్లాడింది అలేఖ్య చిట్టి. పచ్చళ్లు తర్వాత ముందు కెరీర్‌పై ఫోకస్ పెట్టు అని దూషించింది. ఈ డిస్కషన్ ఆడియో రూపంలో చక్కర్లు కొట్టింది. దీంతో నెటిజన్లు అలేఖ్య చిట్టి పికెల్స్‌ను టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ దెబ్బకు అలేఖ్య క్షమాపణలు చెప్పడంతో వీరి వ్యాపారం కూడా మూసేశారు.

తెలుగునాట పాపులరైన అలేఖ్య చిట్టి సిస్టర్స్

వివాదం సంగతేమో కానీ అలేఖ్య చిట్టి సిస్టర్స్ బాగా పాపులర్ అయ్యారు. దీంతో వీరికి బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ఛాన్స్ పక్కా అని సోషల్ మీడియాలో గాసిప్స్ వైరల్ అయ్యాయి. సహజంగానే ఇలాంటి వివాదాస్పద వ్యక్తులను వెతికి పట్టుకోవడంలో బిగ్‌బాస్ టీమ్ ముందుంటుంది. అందుకే ఖచ్చితంగా బిగ్‌బాస్ తెలుగు 9లో అలేఖ్య సిస్టర్స్‌కు ఛాన్స్ పక్కా అని రూమర్స్ గట్టిగానే వినిపించాయి. ట్రోలింగ్‌ను తట్టుకుని నిలబడిన ఈ సిస్టర్స్‌కు బిగ్‌బాస్ కరెక్ట్ ప్లేస్ అని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ముగ్గురు సిస్టర్స్‌లో ఎవరికి బిగ్‌బాస్ ఆఫర్ వస్తుంది? అనే దానిపైనా డిస్కషన్ నడిచింది. వివాదానికి కారణమైన అలేఖ్య చిట్టి కానీ , గ్లామర్‌తో వెలిగిపోయే రమ్య గోపాల్ కానీ ఆఫర్ అందుకునే అవకాశాలు ఉన్నాయని కథనాలు వచ్చాయి.

Take a Poll

అశ్విన్ బాబు సినిమా ఈవెంట్‌లో రమ్య

కానీ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు బుల్లితెర కాదు ఏకంగా సినిమాల్లోనే అలేఖ్య సిస్టర్‌కు అవకాశం దక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ అక్కాచెల్లెళ్లలో ఒకరైన రమ్య గోపాల్ సడెన్‌గా ఓ సినిమా ఈవెంట్‌లో కనిపించింది. టాలీవుడ్ యువ హీరో అశ్విన్‌బాబు నటించిన విచ్చినవాడు గౌతమ్. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరగ్గా.. వేదికపై రమ్య గోపాల్ కంచర్లను చూడగానే అంతా షాక్ అయ్యారు. బ్లాక్ డ్రెస్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పక్కన చిరునవ్వులు చిందిస్తున్న రమ్య ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పచ్చళ్ల బిజినెస్ నుంచి ఏకంగా హీరోయిన్ అయిపోయిందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే నిజంగా రమ్య గోపాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిందా? లేక ఏదైనా పాత్ర పోషించిందా? అన్నది త్వరలోనే తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X