అలీ, బ్రహ్మానందంలకు నో చెప్పిన పూరీ జగన్నాధ్!?
పూరీ జగన్నాధ్ ప్రతీ చిత్రంలోనూ బ్రహ్మానందం, అలీలకు ప్రత్యేకమైన కామిడీ ట్రాక్ ఉంటుంది. అయితే ఈసారి మహేష్ తో చేస్తున్నది బిజినెస్ మ్యాన్ చిత్రంలో వారిద్దరికీ నో చెప్పాడని తెలుస్తోంది. కేవలం ధర్మవరపు సుబ్రమణ్యం మీద కామిడీ ఉండేలా ప్లాన్ చేసాడని, మిగతా కామిడి విభాగాన్ని మహేష్ చేతే మోయించాడని అని వినపడుతోంది. దూకుడు సూపర్ హిట్ తో మహేష్ కామిడీ మీద విపరీతమైన నమ్మకం కలిగిన పూరీ జగన్నాధ్ ఇలా ప్లాన్ చేసాడని చెప్పుకుంటున్నారు. అయితే చిత్రంలో మంచి కామిడీ ఉందని,యాక్షన్ తో పాటు ఆ సీన్స్ కు కూడా ప్రాముఖ్యత ఉందని సమాచారం.
ఇక మహేష్ బాబు దూకుడుతో పెరిగిన మార్కెట్ కు అనుగుణంగానే బిజినెస్ మ్యాన్ ఉండబోతోందని చెప్తున్నారు. అందులోనూ గతంలో మహేష్, పూరీ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మెగా హిట్ ఫిలిం కావటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఉన్నాయి. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో కథ నడవనుంది. తెలుగు,తమిళ్,మలయాళ భాషల్లో జనవరి 11 న ఈచిత్రం విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దూకుడు ఆడియో మంచి విజయం సాధించటంతో అతన్నే ఈ సినిమాకు మహేష్ ఎంచుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నిమిత్తం వదిలిన ఫస్ట్ లుక్ ట్రైలర్ అందరి ప్రశంసలూ పొందుతోంది. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో విడుదల అవనున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో విజేతగా నిలిచి దూకుడు రికార్డులను బ్రద్దలు కొడుతుందని మహేష్ ఫ్యాన్స్ సైతం ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











