బ్రహ్మానందంకు ఆలీ కౌంటర్!?
బ్రహ్మానందం కు మరో హాస్య నటుడు ఆలీ కౌంటర్ ఇవ్వనున్నారని సమాచారం. అయితే అది డైరక్ట్ గా కాదు..టీవీ ఛానెల్స్ ద్వారా. ఐ న్యూస్ వారు బ్రహ్మానందంతో గేమ్ షో ప్లాన్ చేస్తుంటే పోటీ ఛానెల్ వారు అయిన ఎన్ టీవీ వారు అలీతో గేమ్ షో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బ్రహ్మానందం షో ప్రారంభం కాకముందే మంచి క్రేజ్ రావటంతో ఎన్ టీవీ వారు ఇట్లాంటి షోనే కాస్త డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ప్రారంభించాలనుకున్నారు. దాంతో బ్రహ్మీకి ఆలీ మాత్రమే గట్టి పోటీ ఇవ్వగలగని భావించిన 'ఎన్ టీవీ' న్యూస్ ఛానెల్ తాజాగా ఆలీ తో ఓ టాక్ షో కి ప్లాన్ చేసిందనీ, ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతోందనీ తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఓ ప్రకటన కూడా వెలువడే అవకాశాలున్నాయి. బ్రహ్మానంద వెర్సస్ ఆలీ షోలలో ఎవరిది పైచేయి అవుతుందో, ఏ ఛానెల్ టిఆర్ పి రేటింగ్ 'తారా' స్థాయికి చేరుకుంటుందో చూడాలని మీడియా సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











