కొత్త మార్గం ఎంచుకున్న అలీ.. జగన్ కారణం గానే! అనుకున్నదొకటి అయ్యిందొకటి..

కమెడియన్ అలీ.. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఫేమస్ పర్సనాలిటీ. తనదైన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించే అలీ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. సినిమాలతో పాటు పలు పబ్లిక్ ఈవెంట్లలో కూడా సత్తాచాటి ఫాలోయింగ్ పెంచుకున్నాడు. అయితే తాజాగా అలీ తీసుకున్న ఓ నిర్ణయానికి జగన్ కారణం అని తెలుస్తుండటం హాట్ ఇష్యూగా మారింది. ఆ వివరాలు చూద్దామా..

సినిమాలే కాదు.. అక్కడ కూడా

సినిమాలే కాదు.. అక్కడ కూడా

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీషోలు చేస్తూ ఇటు వెండితెర, అటు బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేస్తున్నాడు. ఈ రెండే కాకుండా రాజకీయ రంగంలోనూ సత్తా చాటి తన ప్రత్యేకత చూపించాలని ఆరాట పడ్డాడు అలీ. కానీ అది అందని ద్రాక్ష గానే మిగలడంతో.. ఇక లాభం లేదని రూటు మార్చేశాడు ఈ కమెడియన్.

నామినేటెడ్ పోస్ట్ ఖాయం.. ఊసేలేదు

నామినేటెడ్ పోస్ట్ ఖాయం.. ఊసేలేదు

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో చేరిన అలీకి ఏదో ఒక నామినేటెడ్ పదవి వస్తుందని అంతా అనుకున్నారు. వైసీపీ బంపర్ మెజారిటీతో గెలుపొందిన తర్వాత అలీ రాజకీయ కార్యకలాపాలతో బిజీ అవుతాడని ప్రచారం జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చాడు కాబట్టి అలీకి నామినేటెడ్ పోస్ట్ ఖాయం అని టాక్ నడించింది. కానీ ఇంత వరకు ఆ ఊసేలేదు.

కొత్త దారి ఎంచుకున్న అలీ

కొత్త దారి ఎంచుకున్న అలీ

మరోవైపు సినీ ఇండస్ట్రీకి చెందిన 30 ఇయర్స్ పృథ్వీ, విజయ్ చందర్ లాంటి వాళ్లకు మాత్రం ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ వంటి నామినేటెడ్ పదవులు దక్కాయి. కానీ ఆలీకి చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో ఇక పోస్ట్ కష్టమే అని భావించాడేమో కాబోలు.. అలీ కొత్త దారి ఎంచుకున్నాడు.

24 క్రాఫ్ట్ సేవలు.. రాజకీయాలను నమ్ముకోకుండా

24 క్రాఫ్ట్ సేవలు.. రాజకీయాలను నమ్ముకోకుండా

పూర్తిగా రాజకీయాలను నమ్ముకోకుండా కొత్తగా ‘అలీవుడ్' అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు అలీ. ఇకపై ఈ సంస్థ ద్వారా వెబ్ సిరీస్, టెలీ సీరియల్స్ నిర్మాణం చేస్తాడట. 24 క్రాఫ్టులకు సంబంధించిన సేవలను ఈ సంస్థలో కల్పించబోతున్నారని సమాచారం. వీటి నిర్మాణంతో పాటు అందులో నటించడానికి కూడా రెడీ అవుతున్నాడట అలీ.

సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు

సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు

ఇది తెలిసి సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు తెరపైకి వచ్చాయి. రాజకీయాల్లో ఆశించిన పదవి దక్కకపోవడంతో అలీ ఇలా నిర్ణయించుకున్నారని అంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా అలీ తీసుకున్న ఈ నిర్ణయానికి ఏకంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కారణం అని చెప్పుకుంటుండటం గమనార్హం. మరోవైపు త్వరలో అలీకి ఆయన స్థాయికి తగ్గ పదవి రానుందని అంటున్నాయి వైసీపీ వర్గాలు. చూడాలి మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X