అలీకి షాక్.. పవన్ కళ్యాణ్‌కి ఫోన్, నాగబాబుని ప్రసన్నం చేసుకొనే పనిలో!
Recommended Video

కమెడియన్ అలీ అటూ ఇటూ ఊగిసలాడడంతోనే సమయం మించిపోయేలా ఉంది. గత కొంత కాలంగా అలీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాడు. తెలుగు దేశం పార్టీ, జనసేన, వైసిపి ఇలా అన్ని ప్రధాన పార్టీలతో అలీ చర్చలు జరిపాడు. దీనితో ఏదో ఒక పార్టీ తరుపున అలీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ ఆలీకి ఊహించని షాక్ ఎదురైంది. కొన్ని రోజుల క్రితం అలీ వైసిపిలో చేరినా టికెట్ దక్కలేదు.

వైసిపి తీర్థం
ఇటీవల అలీ లోటస్ పాండ్‌లో జగన్‌ని కలసి వైసిపి తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అలీ, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. ఈ విషయం గురించి అలీని ప్రశ్నించగా రాజకీయం వేరు, స్నేహం వేరు అని సమాధానం ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ జనసేనలోకి తనని ఆహ్వానించలేదని సమాధానం ఇచ్చాడు. అలీకి వైసిపి టికెట్ ఖాయం అనుకుంటున్న తరుణంలో నిరాశ ఎదురైంది. అలీ పేరు లేకుండానే జగన్ అభ్యర్థుల పూర్తి జాబితాని ప్రకటించేశారు.

కారణం అదే
జగన్ అలీకి టికెట్ కేటాయించకపోవడానికి కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి. జగన్ తాను సర్వే చేయించుకున్న ప్రకారమే అభ్యర్థుల్ని ఎంపిక చేశారట. చిన్న రిస్క్ తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదని అంటున్నారు. అందువల్లే అలీకి కి ఆశాభంగం కలిగింది. అలీ చాలా నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా ఎన్నికల్లో పోటీ చేయాలని అలీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ చివరి దశలో కూడా ప్రయత్నాలు చేస్తున్నాడట.

పవన్ కళ్యాణ్‌కి ఫోన్
జగన్ మొండిచేయి చూపడంతో అలీ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ కోసం రిక్వస్ట్ చేయగా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.. ఈ టైంలో ఏం చేయలేను అంటూ పవన్ సమాధానం ఇచ్చాడట. ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు పవన్ అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను పోటీ చేయబోయే గాజువాక, భీమవరం నియోజకవర్గాలలో నామినేషన్ దాఖలు చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

నాగబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో
పవన్ కళ్యాణ్ కూడా కుదరదని చెప్పడంతో అలీ ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబుని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారట. నాగబాబు కూడా ఇటీవలే జనసేన పార్టీలో చేరారు. ఆయన నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా జనసేన టికెట్ ఇప్పించాలని రిక్వస్ట్ చేస్తున్నాడట. పవన్ కళ్యాణ్ వద్ద నాగబాబు రెకమండేషన్ ఏ మేరకు పనిచేస్తుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











