రామ్ చరణ్‌తో సై.. అల్లు అర్జున్‌తో నై! స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ డెసిషన్
మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ విషయంలో ఓ స్టార్ హీరోయిన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఫిలింనగర్‌లో అందరూ ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అసలు విషయం ఏంటి? వివరాల్లోకి పోతే..

రామ్ చరణ్‌తో సై.. వెంటనే
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది ఆలియా భట్. పలు సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకున్న ఈమె టాలీవుడ్ ఆడియన్స్‌ని కూడా టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన RRR సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ సెట్స్ పైకి వచ్చిన ఈమె మేజర్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొంటోంది.

అల్లు అర్జున్ కోసం పిలుపు
ఇంతలో ఆలియా భట్‌కి అల్లు అర్జున్ సరసన నటించాలని పిలుపు వచ్చిందట. అల్లు అర్జున్ హీరోగా ఈ ఏడాది రాబోతున్న సినిమాల్లో ఒకటి 'ఐకాన్'. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా నటించాలని ఆలియా భట్‌ని సంప్రదించారట యూనిట్ సభ్యులు. కానీ ఆ ఆఫర్‌ని ఆలియా సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది.

అల్లు అర్జున్‌తో నైై! కారణమిదే
రామ్ చరణ్ సరసన RRR సినిమాకు ఓకే చేసిన ఈ అమ్మడు అల్లు అర్జున్ సరసన నటించనని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఒకింత బన్నీ ఫ్యాన్స్ ని నిరాశ చెందించినప్పటికీ.. ఆమె నటించకపోవడానికి అసలు కారణం తెలుసుకొని ఊపిరిపీల్చుకున్నారు ఫ్యాన్స్. తనకు ఇతర సినిమాల కమిట్‌మెంట్స్ ఉండటం కారణంగానే ఈ సినిమాలో నటించలేనని ఆలియా చెప్పినట్లు సమాచారం.

రామ్ చరణ్ RRR.. అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో'
ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా, అల్లు అర్జున్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో' షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది మెగా అభిమానులను కనువిందు చేయనున్నాయి.


Click it and Unblock the Notifications











