అడివి శేష్ సినిమాలో అలియా.. మేజర్ కోసం వస్తుందా..?
రాజీ సినిమాలో సీక్రెట్ ఏంజెంట్‌గా అద్భుతమైన నటనను కనబర్చింది అలియా భట్. ఈ చిత్రం బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వంద కోట్ల వసూళ్లను కొల్లగొట్టి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల స్టామినా చూపెట్టింది. మళ్లీ అటువంటి పాత్రలో నటించబోతోన్నట్లు టాక్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్రను పోషించి, రామ్ చరణ్‌కు జోడిగా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు నిర్మాణంలో..
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న మహేష్ బాబు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడన్న సంగతి తెలిసిందే. యాడ్స్‌లతో ఓ వైపు, థియేటర్ల బిజినెస్, బట్టల వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో అడుగుపెట్టిన సూపర్ స్టార్.. తాను చేయలేని మంచి కథలను తన నిర్మాణ సంస్థలోని తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో అడివి శేష్ హీరోగా రాబోతోన్న మేజర్ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తున్నాడు.

మేజర్ సినిమాతో బిజీ..
క్షణం, గూఢచారి, ఎవరు లాంటి వరుస హిట్లతో దూసుకుపోతోన్న హీరో అడివి శేష్. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెరకెక్కించడంలో అడివి శేష్ స్టైల్ ప్రత్యేకమన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మేజర్ అనే మరో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడీ హీరో. మేజర్ సందీప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని `గూఢచారి` ఫేమ్ శశికిరణ్ తిక్క తెరకెక్కిస్తున్నారు.

రంగంలోకి దిగిన మహేష్-నమ్రత
మేజర్ చిత్రంలో అలియాను నటింపజేసేందుకు మహేష్-నమ్రతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరి అలియా వీరి మాటను కాదంటుందా? లేదా మేజర్ చిత్రంలో భాగమవుతుందా? అన్నది చూడాలి. అలియా ఉంటే మేజర్‌కు కచ్చితంగా ప్లస్ అవుతుందన్నది కాదనలేని సత్యం.

బిజీగా ఉన్న అలియా..
ప్రస్తుతం బాలీవుడ్‌లో అలియా భట్, శ్రద్దా కపూర్ లాంటి హీరోయిన్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అలియా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటమే కాకుండా రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమాయణం కూడా నడుపుతోంది. వీరిద్దరు కలిసి బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా నటిస్తున్నారు. రీసెంట్‌గా కలంక్ అనే చిత్రంతో పలకరించినా.. అది అంతగా సక్సెస్ కాలేదు.


Click it and Unblock the Notifications











