RRR ఎఫెక్ట్ :NTR 30 నుంచి తప్పుకున్న అలియా భట్.. అదే కాక మరో రీజన్ కూడా?
జూనియర్ ఎన్టీఆర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి నటించారు. మార్చి 25 న విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఆయన త్వరలో కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉండగా తాజాగా ఈ సినిమా హీరోయిన్ కి సంబంధించి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

RRR
2018లో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా తరువాత చాలా గాప్ తీసుకున్న ఆయన ఆ సినిమా అయిన వెంటనే రాజమౌళి RRR కోసం ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చారు.

అనూహ్యంగా
ఇక రాజమౌళి సినిమా మార్చ్ 25న విడుదల కాగా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ కొమురం బీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఈ సినిమాకు కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. ఇక రాజమౌళి RRR తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తోనే సినిమా చేయాల్సి ఉంది. నిజానికి త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా పూర్తి చేసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ రద్దయింది.

బాలీవుడ్ హీరోయిన్ ని
అప్పుడే కొరటాల శివ ఎన్టీఆర్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. ఈ సినిమా అధికారిక ప్రకటన మినహా ఈ సినిమా నుంచి మరో ప్రకటన ఏమీ వెలువడక పోవడంతో ఈ సినిమాలో నటించే వారి గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో ఒక బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవాలని భావిస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.

అగ్రిమెంట్ మీద సంతకం కూడా
ఈ క్రమంలోనే దిశా పటాని, జాన్వీ కపూర్ లాంటి వాళ్ళ పేర్లు కూడా తెరమీదకు రాగా కియారాను ఫైనల్ చేశారని ఆ మధ్య ప్రచారం అయింది. ఆ తరువాత వారంతా కాదని బాలీవుడ్ నటి అలియా భట్ ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా దాదాపుగా ఖరారు అయినట్లు ఆ మధ్య వార్తలు బయటకు వచ్చాయి. ఏకంగా అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసేసింది అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది.

'RRR'లో తన పాత్రను
అయితే అయితే, ఆలియా భట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని అంటున్నారు. దర్శకుడు కొరటాల శివ - ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటించలేనని క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ముంబైలో తన వ్యక్తిగత, వృత్తిపరమైన కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండటమే కారణమని అంటున్నారు.దానికి తగట్టు ఆమె 'RRR'లో తన పాత్రను తగ్గించిన విషయంలో కూడా అప్సెట్ గా ఉందని, ఇప్పట్లో హిందీలో అది కూడా మెయిన్ లీడ్ ఉన్న రోల్స్ మాత్రమే చేయాలనీ నిర్ణయించుకుడనై అంటున్నారు.


Click it and Unblock the Notifications











