Brahmastra: చిరంజీవి కోసం బ్రహ్మాస్త్ర స్పెషల్ షో.. లాల్​ సింగ్​ చద్ధా మూవీలా?

బాలీవుడ్​లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. లవ్​ బర్డ్స్, కొత్త పెళ్లి జంట అయిన రణ్​బీర్​ కపూర్, అలియా భట్​ తొలిసారిగా జోడీగా సిల్వర్​ స్క్రీన్​పై మెరవబోతున్నారు. పాన్​ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను బ్రహ్మాస్త్రం టైటిల్​తో తెలుగులో విడుదల చేయనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్​ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా స్పెషల్​ షోను మెగాస్టార్​ చిరంజీవి కోసం వేయనున్నారట.

పాన్​ ఇండియాగా..

పాన్​ ఇండియాగా..

రణ్​బీర్​ కపూర్​, అలియా భట్​తోపాటు అమితాబ్ బచ్చన్​, టాలీవుడ్​ కింగ్ నాగార్జున, మౌనీ రాయ్​ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఫాక్స్ స్టార్ స్టూడియోస్​, కరణ్ జోహర్​ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

 భారీగా ఖర్చు..

భారీగా ఖర్చు..

ఈ సినిమాకు ప్రీతం సంగీతం అందించగా, దక్షిణాది భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో షారుక్ ఖాన్​ ఓ గెస్ట్ రోల్​ కూడా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ మూవీ విజుల్ ఎఫెక్ట్స్​ కోసం భారీగా ఖర్చు పెట్టినట్లు ఇటీవల విడుదలై టీజర్ చూస్తే తెలుస్తోంది.

ముఖ్య అతిథిగా ఎన్టీఆర్​..

ముఖ్య అతిథిగా ఎన్టీఆర్​..


ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్​ ఈవెంట్ కోసం యంగ్​ టైగర్​ ఎన్టీఆర్​ను ముఖ్య అతిథిగా తీసుకురానున్నారు. దీంతో బ్రహ్మాస్త్రపై మరింత హైప్ పెంచేలా చేస్తున్నారు. అయితే ఇంతేకాకుండా తెలుగులో సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా ఓ షో వేయాలని ప్లాన్​ చేస్తుందట బ్రహ్మాస్త్ర చిత్రబృందం.

 చిరంజీవి వాయిస్​ ఓవర్​..

చిరంజీవి వాయిస్​ ఓవర్​..

ఈ ప్రీమియర్​ షోకు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా తీసుకురావాలని ఆలోచిస్తున్నారట. ఇదిలా ఉంటే చిరు కూడా ఈ మూవీకి సహాయసహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ తెలుగు ట్రైలర్​కు చిరంజీవి వాయిస్​ ఓవర్​ ఇచ్చారు. సినిమాలో కూడా తన గాత్రం వినిపించనున్నారు.

స్పెషల్ షో..

స్పెషల్ షో..

సో.. ఇప్పుడు చిరంజీవితోపాటు తెలుగులోని ప్రముఖ సెలబ్రిటీలకు ఓ షో వేస్తే బ్రహ్మాస్త్ర ప్రచారానికి బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. ఇది ఎలా ఉన్న ఇటీవల అమీర్ ఖాన్​ లాల్ సింగ్​ చద్ధా సినిమా షోను చిరంజీవి కోసం ఓ స్పెషల్ షో వేసిన విషయం తెలిసిందే.

 ఈ సినిమా రిజల్ట్​?

ఈ సినిమా రిజల్ట్​?

తర్వాత ఆ సినిమాను తెలుగులో సమర్పిస్తానని చిరు ముందుకు వచ్చారు. కానీ ఆ మూవీ డిజాస్టర్​గా నిలిచింది. ఇప్పుడు చిరంజీవి కోసం బ్రహ్మాస్త్ర స్పెషల్​ షో వేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అని టాలీవుడ్​ వర్గాల్లో ఇన్​సైడ్​ టాక్​ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X