RRR: అలియా భట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Recommended Video

Huge Remumeration To Alia Bhatt For #RRR Movie || Filmibeat Telugu

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టులోకి అలియా భట్‌ను తీసుకుంటున్నట్లు గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ప్రెస్ మీట్ జరుగడానికి కొన్ని రోజుల ముందే అలియా భట్ విషయం మీడియాకు లీకైంది.

దాదాపు రెండు నెలల ముందు నుంచే అలియా భట్‌తో చిత్ర బృందం చర్చలు జరుపుతోందట. రాజమౌళి కథ చెప్పగానే నచ్చిందని, తప్పకుండా చేస్తానని చెప్పిన అలియా భట్... రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గలేదని సమాచారం. ఈ క్రమంలో ఆమెతో పలు దఫాలు చర్చలు జరిపారట. ఆమె సైన్ చేసిన తర్వాతే అఫీషియల్‌గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విషయం వెల్లడించారు.

ఇంతకీ అలియా భట్ రెమ్యూనరేషన్ ఎంత?

ఇంతకీ అలియా భట్ రెమ్యూనరేషన్ ఎంత?

అలియా భట్ బాలీవుడ్లో వరుస విజయాలు అందుకోవడంతో పాటు తన అద్భుతమైన యాక్టింగ్ టాలెంటుతో మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్‌గా మారింది. పలు బాలీవుడ్ భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది. ‘రాజీ' సినిమా విజయం తర్వాత ఆమె రెమ్యూనరేషన్ మరింత పెరిగిందట. ఈ చిత్రానికి రూ. 7.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

RRR అలియా భట్ రెమ్యూనరేషన్

RRR అలియా భట్ రెమ్యూనరేషన్

RRR చిత్రానికి అలియా భట్ తాను బాలీవుడ్లో ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే చార్జ్ చేసిందట. అలియా భట్ తమ సినిమాకు అవసరం, బాలీవుడ్ మార్కెట్ పరంగా కలిసొస్తుంది కాబట్టి ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాత దానయ్య అంగీకరించినట్లు సమాచారం. రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల వరకు చార్జ్ చేస్తుందని టాక్.

భారీ బడ్జెట్ మూవీ

భారీ బడ్జెట్ మూవీ

ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చిన్న స్కేల్‌లో తీయడం లేదని, భారీ మొత్తం ఖర్చు పెడుతున్నట్లు రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. మీడియా అడిగిన ప్రశ్నకు నిర్మాత దానయ్య స్పందిస్తూ ఆన్ బోర్డ్ బడ్జెట్ రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. జులై 30, 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రాజమౌళికి థాంక్స్ చెప్పిన అలియా

రాజమౌళికి థాంక్స్ చెప్పిన అలియా

రాజమౌళి అలియా భట్ గురించి అధికారిక ప్రకటన చేయగానే.. ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘‘ఈ ప్రాజెక్టులో భాగం కావడం గర్వంగా ఫీల్ అవుతున్నా. అద్భుతమైన టీంతో ఈ జర్నీని ప్రారంభించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నా. థాంక్యూ రాజమౌళి సర్... భారీ చిత్రంలో నాకు అవకాశం కల్పించినందుకు'' అంటూ స్పందించారు.

రాజమౌళి హ్యాపీ

రాజమౌళి హ్యాపీ

అలియా భట్ ట్వీట్ చేయగానే రాజమౌళి రిప్లై ఇస్తూ... నీ గురించి చాలా వింటున్నా. నీ తోటి నటులతో పోటీపడి ఎదుగుతున్నావు. ఆర్ఆర్ఆర్ మూవీలో నీ పెర్ఫామెన్స్ చూసేందుకు ఆసక్తిగా ఎదరుచూస్తున్నట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X