twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి చెప్పడంతో ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్.. ఇక తెలుగులో తిరుగులేదు!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీపై ప్రస్తుతం బాలీవుడ్ నటిమనులు కాస్త స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు అనిపిస్తోంది. చాలా వరకు కెరీర్ మొదట్లో తెలుగు సినిమాల్లో ఒక ఛాన్స్ వస్తే చాలు అనుకునే బాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కసారి అటు వెళ్లిపోయాక తెలుగ ఆఫర్స్ వస్తే.. చిన్నచూపుతో చూస్తుంటారు. కానీ ఇప్పుడు మాత్రం హిందీలో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా తెలుగు ఆఫర్స్ వస్తే.. నో చెప్పడం లేదు.

    బాహుబలి తరువాత..

    బాహుబలి తరువాత..

    బాహుబలి సినిమా తరువాత చాలా వరకు బాలీవుడ్ సెలబ్రెటీలకు జ్ఞానోదయం అయ్యింది. ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదని తెలుగు సీనిమాల్లో అవకాశం వస్తే వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అడిగి మరి అవకాశాలు అందిపుచ్చుకున్నవారు కూడా ఉన్నారు. ప్రస్తుతం చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

    రాజమౌళి కోసం..

    రాజమౌళి కోసం..

    రాజమౌళికి ప్రభాస్ కి మధ్యన ఎలాంటి స్నేహం ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే ప్రభాస్ తన తదుపరి సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతుండగా రాజమౌళి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. RRRలో నటిస్తున్న అలియా భట్ ని సెలెక్ట్ చేసుకొమ్మని ప్రభాస్ కి చెప్పారట. ప్రభాస్ కూడా అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

    ఆ సినిమాలోనే..

    ఆ సినిమాలోనే..

    ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరొక పాన్ ఇండియా సినిమాతో ప్రభాస్ బిజీ కానున్నాడు. ఆ సినిమా కోసం అలియా భట్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.

    Recommended Video

    Mahanati Director Nag Ashwin On Liquor Selling In Theatre & Multiplexes
    తెలుగుపై స్పెషల్ ఫోకస్..

    తెలుగుపై స్పెషల్ ఫోకస్..

    అలియా భట్ ఇక నుంచి తెలుగు సినిమాలు కూడా చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిందట. ప్రత్యేకంగా తెలుగు కూడా నేర్చుకుంటోందట. అయితే ఆమె RRR షూటింగ్ ని ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. లాక్ డౌన్ అనంతరం చిత్ర యూనిట్ తో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ వైపు RRR సినిమా మరోవైపు ప్రభాస్ సినిమాతో బిజీ కానున్న అలియా భట్ మంచి విజయాల్ని అందుకుంటే తెలుగులో తిరుగుండదనే చెప్పాలి.

    English summary
    Radhakrishna is directing a film with prabhas. After that, Prabhas will be busy with another Pan India film directed by Nag Ashwin. Alia Bhatt has been selected as the heroine for the film. The post-production work on the film is currently underway.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X