రామ్ చరణ్ సీతతో ఎన్టీఆర్ రొమాన్స్.. ఎలా కనిపిస్తుందో తెలిస్తే మైండ్ బ్లాకే

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింట్లోనూ ఇరగదీస్తూ స్టార్ హీరోగా హవాను చూపిస్తున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. దీనికితోడు ఈ మధ్య కాలంలో వరుసగా సక్సెస్‌లను సొంతం చేసుకుంటూ ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్నాడు. అంతేకాదు, RRR మూవీతో ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ లెవెల్‌కు కూడా ఎదిగిపోయాడు.

కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు 'దేవర' అనే పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ఈ బడా హీరో.. బాలీవుడ్‌లో నేరుగా 'వార్ 2' అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇందులో అతడు హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. గతంలో వచ్చి హిట్ అయిన 'వార్'కు ఇది సీక్వెల్‌గా వస్తుంది.

Alia Bhatt To Pair Up With Jr NTR in WAR 2 Movie

జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'వార్ 2' సినిమాను 'బ్రహ్మాస్త్ర' ఫేం అయాన్ ముఖర్జీ తీస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలైపోయింది. అంతేకాదు, ఓ టెస్ట్ షూట్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. ఆ వెంటనే ఫారెన్ కంట్రీస్‌లో కొన్ని క్రేజీ షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేసుకున్నారు.

ఇండియాలోనే బడా స్టార్లు కలిసి చేస్తున్న 'వార్ 2' మూవీని హై రేంజ్‌లో రూపొందిస్తున్నారు. దీంతో ఈ చిత్రంలో నేషనల్ రేంజ్ యాక్టర్లను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా చేసే హీరోయిన్లు గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది పేర్లు కూడా తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

Alia Bhatt To Pair Up With Jr NTR in WAR 2 Movie

అత్యంత భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'వార్ 2' మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా ఆలియా భట్ నటిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇందులో ఆమె పాత్ర ఎవరూ ఊహించని విధంగా ఉండబోతుందట. అంతేకాదు, ఇందులో ఆలియా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా చేయబోతుందని అంటున్నారు. దీంతో ఈ చిత్రంపై హైప్ పెరుగుతోంది.

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రూపొందుతోన్న 'వార్ 2' మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం కోసం సదరు సంస్థ దాదాపు రూ. 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు కూడా తెలిసింది. ఈ చిత్రాన్ని 2025 ఆగస్టులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X