RRR: హర్టయిన అలియా.. రాజమౌళిని అన్ ఫాలో.. పోస్టులు డిలీట్.. అసలేమైందంటే?

బాలీవుడ్ భామ అలియా భట్ 'RRR' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. రాజమౌళి డైరెక్షన్లో అవకాశం అనగానే రెండో ఆలోచన లేకుండా ఈ సినిమాకు అలియా ఓకే చెప్పేసిందని ఆ మధ్య టాక్ వినిపించింది. అయితే ఈ సినిమాలో చివరకు ఆమెకు నిరాశ మాత్రమే మిగిలింది. ఈ క్రమంలో సినిమా విషయంలో అలిగిన అలియా భట్ తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. ఏకంగా ఆమె రాజమౌళికి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు

Recommended Video

RRR Movie పై Alia Bhatt హర్ట్.. అలియా ని మించిన Olivia Morris క్రేజ్| Filmibeat Telugu
దక్షిణాదిలో కూడా ఏలాలి అనుకుని

దక్షిణాదిలో కూడా ఏలాలి అనుకుని

దర్శకధీరుడు రాజమౌళి దర్శకతవంలో తెరకెక్కిన RRR విడుద‌లైన అన్నికేంద్రాల్లో స‌క్సెస్ ఫుల్ టాక్‌తో, మంచివ‌సూళ్ల‌తో ముందుకు వెళుతోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల క్ల‌బ్‌లోకి చేరిపోయి బాక్సాపీస్‌ రికార్డుల ఊచ కోత కొస్తోంది.

అయితే ఈ సినిమాతో ఆలియా భట్ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుని ఒకపక్క బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో కూడా ఏలాలి అనుకుని అనేక కలలు కనింది.

షాక్ తగిలినట్లయింది

షాక్ తగిలినట్లయింది

అలా ఆమె RRR సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీత పాత్రలో నటించింది. అయితే సినిమాలో అలియా భట్ పాత్ర చాలా తక్కువ సమయం మాత్రమే కనిపిస్తుంది. ఎన్నో కలలతో ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన అలియాకు... స్క్రీన్ స్పేస్ మరీ దారుణంగా ఉండేసరికి షాక్ తగిలినట్లయింది అని అంటున్నారు.

వాయిదా పడక ముందు

వాయిదా పడక ముందు

ఇక ఈ విషయంలో ఏం చేయాలో? ఎలా చేయాలో? అర్థం కాక ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుంచి రాజమౌళిని అన్ ఫాలో చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, 'RRR' సినిమాకు సంబంధించిన పలు పోస్టులు డిలీట్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో తన పాత్ర పట్ల అసంతృప్తిగా ఉండటంతో తన ఇంస్టాగ్రామ్ లో రాజమౌళిని అన్ ఫాలో చేసింది అని సోషల్ మీడియాలో వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

వాయిదా పడక ముందు

వాయిదా పడక ముందు

నిజానికి RRR విడుదల సంక్రాంతికి వాయిదా పడక ముందు నిర్వహించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో అలియా చాలా ఉత్సాహంగా పాల్గొంది. అయితే తాజాగా విడుదల తేదీ ఖరారైన తర్వాత జరిగిన ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం ఏ మాత్రం కనిపించలేదు. అంతేకాదు సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ అలియా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదనే చెప్పాలి.

ట్వీట్ కానీ, పోస్ట్ కానీ చేయలేదు

ట్వీట్ కానీ, పోస్ట్ కానీ చేయలేదు

అయితే ఆలియా భట్ RRR సక్సెస్ అయిన తరువాత కూడా ఇప్పటివరకు ఒక ట్వీట్ కానీ, పోస్ట్ కానీ చేయలేదు. తన సహ నటుడు రామ్ చరణ్ బర్త్ డేకి విషెష్ చెప్పిన ఆమె ఎందుకు సినిమా పోస్టులు డిలీట్ చేసింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి సీత పాత్రకు తెలుగులో ఆలియా భట్ సొంతంగా డబ్బింగ్ చెప్పాలి అని ఆశ పడింది కానీ చివరకు వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ తో వాయిస్ ఇప్పించారని ఆ విషయంలో కూడా ఆమె నిరాశ గా ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X