మళ్లీ తల్లి కాబోతోన్న స్టార్ హీరోయిన్?.. కేన్స్ ఫెస్టివల్‌‌లో రెడ్ హ్యాండెడ్‌గా!

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ పెళ్లయిన స్టార్ కపుల్స్ ఒక్కొక్కరిగా శుభవార్త చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ - సిద్ధార్ధ్ మల్హోత్రా దంపతులు తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. అటు టాలీవుడ్‌ క్రేజీ కపుల్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిలు కూడా తాము త్వరలో పేరెంట్స్ కాబోతున్నట్లుగా గుడ్‌న్యూస్ చెప్పారు. కొందరు స్టార్ కపుల్ కూడా పేరెంట్స్ కాబోతున్నట్లుగా మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి కానీ దీనిని వారు అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.

బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో ఒకరైన అలియా భట్- రణబీర్ కపూర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీ చిత్ర పరిశ్రమను శాసించే రాజ్ కపూర్ కుటుంబ వారసుడిగా రణబీర్ కపూర్ తాత, తండ్రుల వారసత్వాన్ని నిలబెడుతూ బాలీవుడ్‌లో స్టార్ హీరోగా, భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా నిలిచారు. అటు అలియా భట్ కూడా బలమైన సినీ నేపథ్యం నుంచే వచ్చారు. ఆమె తండ్రి మహేశ్ భట్ ఫేమస్ డైరెక్టర్. అందరి ప్రేమకథల్లాగా అలియా - రణబీర్‌ల లవ్‌స్టోరీ కూడా విచిత్రంగా స్టార్ట్ అయ్యింది.

Alia Bhatt s Cannes Film Festival 2025 appearances spark pregnancy rumours

అలా మొదలైన ప్రేమకథ

షూటింగ్ కోసం ఓ రోజున వీరు ఒకే విమానంలో ప్రయాణిస్తుండగా.. రణబీర్ సీటు సరిగా లేదు. దీంతో ఆయన తన పక్కన వచ్చి కూర్చోగా రణబీర్‌తో అప్పుడే మనసు విప్పి ఎన్నో విషయాలపై మాట్లాడుకున్నామని, ఒకరి అభిప్రాయాలను మరొకరం షేర్ చేసుకున్నామని అలియా తెలిపింది. ఆ క్షణంలోనే తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యామని చెప్పుకొచ్చింది. అలా వీరి పరిచయం ప్రేమగా మారి దాదాపు ఆరేళ్లు డేటింగ్ ‌అనంతరం 2022 ఏప్రిల్ 14న ఈ జంట ఒక్కటైంది. పెళ్లయిన రెండు నెలలకే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు చెప్పి అభిమానులు ఖుషీ చేశారు.

అలియా ప్రెగ్నెన్సీపై రూమర్స్

గర్భం దాల్చినప్పటికీ బ్రహ్మాస్త్ర పార్ట్ 1లో నటించి సినిమాను పూర్తి చేశారు. రణబీర్ - అలియాలు నవంబర్ 6, 2022న తల్లిదండ్రులయ్యారు. ఈ దంపతులకు రహా అనే పండంటి పాప జన్మించింది. ప్రస్తుతం అల్ఫా, లవ్ అండ్ వార్ సినిమాలో అలియా నటిస్తున్నారు. అయితే అలియా మరోసారి గర్బం దాల్చినట్లుగా పలుమార్లు వార్తలు వచ్చాయి. కానీ వీటిని దంపతులిద్దరూ ఖండించారు. తాజాగా మరోసారి అలియా ప్రెగ్నెన్సీపై గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

కేన్స్‌లో తళుక్కుమన్న అలియా భట్

ప్రస్తుతం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు తరలివచ్చారు. నటీమణులు తమ అందాలతో రెడ్ కార్పెట్‌పై హోయలొలికించారు. అలియా కూడా కేన్స్ ఫెస్టివల్‌కు హాజరై డిఫరెంట్ డ్రెస్‌లలో కనిపించారు. ఆమె కేన్స్‌ ఈవెంట్‌కు రావడం ఇదే తొలిసారి. తొలిరోజు ఎంబ్రాయిడీ వర్క్ చేసిన ఫ్లోరల్ గౌనులో కనిపించారు. వేడుకల చివరి రోజు మాత్రం ఫేమస్ బ్రాండ్ గూచి డిజైన్ చేసిన శారీలో మెరిశారు.

Take a Poll

అలియా గర్భం దాల్చారా?
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అలియా గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అలియా కడుపు భాగం కాస్త ముందుకు వచ్చినట్లుగా కనిపిస్తుండటంతో ఆమె మరోసారి గర్భం దాల్చినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది అభిమానులకు సంతోషాన్నిచ్చినా.. ఇండస్ట్రీకి మాత్రం షాకే. గర్బం దాల్చినట్లయితే అలియా కొన్నాళ్లు సినిమాలకు దూరం కావాల్సిందే. అయితే ఇందులో ఎంత వరకు నిజముందో తెలియరాలేదు. అలియా, రణబీర్‌లు స్పందిస్తేనే కానీ ఈ రూమర్స్‌కు చెక్ పడదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X