RRR కోసం రాజమౌళి భారీ స్కెచ్.. ఆలియాభట్ క్రేజీ నిర్ణయం!
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో రిలీజ్‌కు ముందే RRR చిత్రం రికార్డులు తిరగరాస్తున్నది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. అయితే ఈ చిత్రంలో సీత పాత్రలో నటిస్తున్న అలియాభట్ గురించిన ఓ వార్త ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వార్త ఏమిటంటే...

RRRలో కీలక పాత్రలో అలియాభట్
బాలీవుడ్‌లో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటూ, తన ప్రతిభను చాటుకొంటున్న ఆలియాభట్ RRR చిత్రంలో ఓ ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు. రాంచరణ్ అల్లూరి సీతారామారావుగా కనిపిస్తే.. ఆయన పక్కన సీతగా అలియాభట్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అయితే నటనతోపాటు గాయనిగా కూడా RRR చిత్రానికి సహకారం అందిస్తున్నారనే వార్త మీడియాలో వెలుగు చూసింది.

రాజమౌళి భారీ స్కెచ్
RRR చిత్రం కోసం భారీగా ఓ పాటను దర్శకుడు రాజమౌళి చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. ఆ పాటలో భారీగా డ్యాన్సర్లు, అట్టహాసంగా చిత్రీకరణ ఉంటుందంట. స్పెషల్ డ్యాన్స్, పాట కోసం ఆలియా భట్‌ను రంగంలోకి దించారట. ఈ పాటను స్వయంగా ఆలియా భట్ పాడటమే కాకుండా తెర మీద తన సత్తాను చూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారని సినీ వర్గాల సమాచారం.

RRR హిందీ వెర్షన్ కోసమే
అయితే RRR కోసం పాడే పాటలో చిన్న ట్విస్టు కూడా ఉంది. అలియాభట్ కేవలం హిందీకి వెర్షన్‌కు మాత్రమే తన గొంతును అందిస్తున్నారు. అయితే తెలుగు, ఇతర భాషల్లో కూడా పాడించే అవకాశం లేకపోలేదంటున్నారు. ముందుగా హిందీలో ఆమె చేత పాటను పాడించాలని దర్శకుడు ఎంఎం కీరవాణి సిద్ధమవుతున్నారు.
Recommended Video

RRR రిలీజ్ ఎప్పుడంటే
వాస్తవానికి RRR చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. లాక్‌డౌన్ కారణంగా, ఇతరత్రా పరిస్థితుల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తున్నది. లాక్‌డౌన్ తర్వాత షూటింగ్ మొదలు పెట్టిన RRR టీమ్ 2022 జనవరి 8వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











