చిరంజీవి విశ్వంభరలో ఏలియన్స్: ఇండియాలోనే తొలిసారి ఇలా!
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినా.. తనదైన చిత్రాలతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయారు మెగాస్టార్ చిరంజీవి. అలా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు టాలీవుడ్‌లో హవాను చూపించిన ఆయన.. ఇప్పటికీ అదే మార్కును చూపిస్తున్నారు. దీంతోపాటు రెట్టించిన ఉత్సాహంతో వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు.
రీఎంట్రీలో ఫుల్ జోష్‌తో దూసుకుపోతోన్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' అనే సినిమాను చేస్తున్నారు. దీన్ని 'బింబిసార' ఫేం మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుండడంతో దీనిపై ఆరంభంలోనే అంచనాలు భారీ స్థాయిలోనే నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.

డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న 'విశ్వంభర' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఈ ఏడాది ఆరంభంలోనే మొదలైంది. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా వరుసగా షెడ్యూళ్లను ప్లాన్ చేస్తున్నారు. అలా ఏకధాటిగా సినిమా చిత్రీకరణను జరుపుతూనే ఉన్నారు. ఇప్పటి వరకూ మొత్తంగా 40 శాతం టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు.
హై రేంజ్ బడ్జెట్‌తో టెక్నికల్ వండర్‌గా రూపొందుతోన్న 'విశ్వంభర' సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్నో ఊహించని అంశాలను కూడా పెడుతున్నారు. దీనిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది. ఈ సమాచారం ప్రకారం.. ఇందులో ఏలియన్స్ సీక్వెన్స్ ఒకటి హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి - మల్లిడి వశిష్ట కాంబోలో రాబోతున్న 'విశ్వంభర'లో హీరో ముల్లోకాల్లో ప్రయాణం చేస్తాడట. ఆ సమయంలో భవిష్యత్‌లోకి వెళ్లి ఏలియన్స్‌ను కలుస్తాడని తెలిసింది. అప్పుడు వచ్చే కామెడీ సీన్స్ అదిరిపోయేలా ఉంటాయట. మరీ ముఖ్యంగా ఆ సమయంలో వచ్చే విజువల్స్ ఇండియాలోనే ఏ సినిమాలోనూ చూపించని విధంగా ఉంటాయని సమాచారం. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 'విశ్వంభర' మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి, నవీన్ చంద్ర, రాజ్ తరుణ్‌లు కీలక పాత్రలను చేస్తున్నారని తెలిసింది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 10 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











