Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విశాల్ పెళ్లికి రూట్ క్లియర్.. త్వరలోనే తేదీని ప్రకటించనున్నాడా?
టాలీవుడ్, కోలీవుడ్‌లో సరిసమానమైన క్రేజ్‌ను తెచ్చుకున్న నటుడు విశాల్. తమిళనాడులో సెటిలైన తెలుగు కుటుంబంలో పుట్టిన విశాల్ ఇరు రాష్ట్రాల సినీ అభిమానులకు ఇష్టమైన వాడు. స్టార్‌గా ఓ వెలుగు వెలగడంతో పాటు నిర్మాతగా రాణించాడు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి లాంటి కీలక పదవులు చేపట్టారు. నడిగర్ సంఘం భవనం నిర్మించే వరకు పెళ్లి చేసుకోను అంటూ శపథం కూడా చేశాడు.
పెళ్లి ఫిక్స్ అంటూ వార్తలు..
అయితే ఈ యంగ్ హీరో అనుకున్నది సాధించాడు. భవన నిర్మాణం పూర్తి కావడంతో త్వరలో పెళ్లికి సిద్ధమయ్యాడు. హైదరాబాద్‌కు చెందిన తెలుగు అమ్మాయి అనీషారెడ్డితో విశాల్ పెళ్లి ఫిక్స్ అవ్వడం, మార్చి 10న ఎంగేజ్మెంట్ జరిగడం అంతా చకచకా జరిగిపోయింది. అక్టోబర్ 9న విశాల్-అనీషా పెళ్లి ముహూర్తం నిర్ణయించినట్లు ఆ మధ్య వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.
పెళ్లి రద్దు అంటూ షాకింగ్ న్యూస్..
అయితే ఇంతలోనే ఊహించని రూమర్స్ తెరపైకి వచ్చాయి. విశాల్-అనిషా పెళ్లి రద్దు చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునేలోపే ఇలాంటి షాకింగ్ న్యూస్ రావడం చర్చనీయాంశం అయింది. విశాల్-అనీషా రెడ్డి పెళ్లి ఫిక్స్ అయిన సంగతి మొదట బయటకు వచ్చింది అనీషా ద్వారానే.
Recommended Video
ఫోటోలు తొలగించడంతో అనుమానం
ఆమె తన సోషల్ మీడియా పేజీ ద్వారా 2018లో ఈ మ్యాటర్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత విశాల్ అఫీషియల్‌గా అభిమానులకు వెల్లడించారు. అనీషా రెడ్డి తరచూ తనకు కాబోయే వాడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా అభిమానులతో పంచుకున్నారు. అయితే తాజాగా అనీషా రెడ్డి తన సోషల్ మీడియా పేజీ నుంచి ఆ ఫోటోలన్నీ తొలగించింది. దీంతో ఇద్దరి పెళ్లి రద్దయినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఖండించిన విశాల్ తండ్రి..
పెళ్లి రద్దు అంటూ వచ్చిన వార్తలను విశాల్ ఫాదర్ తండ్రి జీకే రెడ్డి ఖండించారు. కొన్ని వ్యక్తిగత కారణాల పెళ్లి తేదీని ఫిక్స్ చేయలేదని తెలిపాడు. నడిఘర్ సంఘం గొడవలు, కోర్టుల చుట్టూ తిరగడం, సినిమాలతో విశాల్ బిజీగా ఉండటంతో తేదీని డిసైడ్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. అయినా సరే వారి పెళ్లిపై రూమార్లు మాత్రం ఆగలేదు.
తాజాగా మరోసారి తెరపైకి
విశాల్ ప్రస్తుతం యాక్షన్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. భారీ ఎత్తున విడుదల చేస్తోన్న ఈ చిత్రంపై విశాల్ చాలానే ఆశలు పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ విడుదలైన తరువాత..తన పెళ్లికి సంబంధించి ఓ క్లారిటీ ఇస్తాడని ఇన్సైడ్ టాక్. ఈ మూవీకి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాక పెళ్లిపైనే తన దృష్టి కేంద్రీకరిస్తాడని, త్వరలోనే పెళ్లి తేదీని ప్రకటించనున్నాడని తెలుస్తోంది. సుందర్ సి దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం రేపు (నవంబర్ 15) విడుదల కానుంది.