నందమూరి హీరో సినిమాలో అల్లరి నరేష్ స్పెషల్ రోల్.. భారీ రెమ్యునరేషన్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న కొంతమంది యువ హీరోలు గత కొంత కాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్నారు. అందులో అల్లరి నరేష్ ఒకడు. గతంలో ఏడాది నాలుగైదు సినిమాలు చేసి కమర్షియల్ హిట్స్ అందుకునే నరేష్ ఇప్పుడు మాత్రం ఒక్క సినిమాతోనే వస్తున్నాడు. ఎంత డిఫరెంట్ గా ట్రై చేసినా కూడా సక్సెస్ దక్కడం లేదు. ఆఖరికి స్టార్ హీరోల సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తున్నా సక్సెస్ దక్కడం లేదు.

ఆ పాత్ర కూడా వర్కౌట్ కాలేదు

ఆ పాత్ర కూడా వర్కౌట్ కాలేదు

కామెడీ మూవీస్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ వారసుడిగా అల్లరి నరేష్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అయితే అందుకున్నాడు గాని ఇంకా స్టార్ హీరోల రేంజ్ కి ఎదగలేకపోతున్నాడు. ఇక మహర్షి సినిమాలో మహేష్ బాబు స్నేహితుడిగా ఒక మంచి పాత్ర చేశాడు. కానీ ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయింది.

నందమూరి బాలకృష్ణ సినిమాలో..

నందమూరి బాలకృష్ణ సినిమాలో..

మహర్షిలో చేయడం వలన నరేష్ ఇలాంటి పాత్రలు కూడా చేయగలడా అనే విధంగా ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వైరల్ అయ్యింది. ఇక ఫైనల్ గా నరేష్ కి అదే తరహాలో మరో ఆఫర్ వచ్చినట్లు టాక్ వస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఒక మాస్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో నరేష్ కి తగిన ఒక పాత్ర ఉందట.

బాలయ్య గ్రీన్ సిగ్నల్

బాలయ్య గ్రీన్ సిగ్నల్

ముందుగా సత్యదేవ్, నవీన్ చంద్ర వంటి వారి పేర్లు వచ్చినప్పటికీ దర్శకుడు మంచి క్రేజ్ ఉన్న హీరో ఆ పాత్ర చేస్తేనే బావుంటుందని డిసైడ్ అయ్యారట. బాలకృష్ణతో కూడా చర్చలు జరపగా అల్లరి నరేష్ మంచి సెలక్షన్ అంటూ ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ స్పెషల్ పాత్ర సినిమాకు చాలా కీలకమని తెలుస్తోంది.

రెమ్యునరేషన్ ఎంత?

రెమ్యునరేషన్ ఎంత?

అయితే ఇంకా నరేష్ ఆ సినిమాలో నటించాలా వద్దా అనే సందేహంలోనే ఉన్నాడట. ఇప్పటికే మహేష్ సినిమాలో నటించి కాస్త రిస్క్ చేసినట్లు ఫీల్ అవుతున్న నరేష్ మరోసారి అలాంటి రిస్క్ చేయవద్దని అనుకుంటున్నాడట. మరోవైపు నిర్మాతలు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఆఫర్ చేసినట్లు టాక్. హీరోగా నరేష్ ఒక్కో సినిమాకి 2కోట్లకు పైగా అందుకునేవాడు.

Recommended Video

Amaram Akhilam Prema Movie Trailer
 నరేష్ ఒప్పుకున్నాడా లేదా?

నరేష్ ఒప్పుకున్నాడా లేదా?

ప్రస్తుతం అల్లరోడు బఫ్జెట్ ని బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ఇక బాలయ్య సినిమా కోసం కరెక్ట్ గా ఎంత ఆఫర్ చేసారన్నది బయటకు రాలేదు. నరేష్ కూడా రెమ్యునరేషన్ కి ఆశపడి సినిమాలు చేయాలని అనుకోవడం లేదట. కేవలం పాత్ర నచ్చితేనే వర్క్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X