సినిమా హిట్ అయితే పెళ్ళి లేదంటే లొల్లి!
ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్, రామానయుడు తరహాలో తమ వారసులకు హిట్ లు ఇవ్వాలని తపన పడుతున్న పలు హిట్ చిత్రాల నిర్మాత దర్శకుడు ఈ వీవీ సత్యనారాయణ. తన ఇద్దరు కుమారులను హీరోలు చేసినా అల్లరి నరేష్ మాత్రమే హీరోగా నిలదొక్కుకున్నాడు. ఆర్యన్ రాజేష్ మాత్రం హిట్ కోసం పల్టీలు కొడుతూనే ఉండటంతో ఈ సారి 'బురిడీ" అంటూ ఈవీవీ మరోసారి ఆర్యన్ రాజేష్ తో సినిమా తీసారు.
మొత్తం సినిమా బ్యాంకాక్ లో అత్యంత రిచ్ గా కామెడీ ఓరియంటెడ్ మెథడ్ ని ఫాలో అవుతూ ఈవీవీ ఈ బురిడీ సినిమా తీసాడట. త్వరలోనే తన తనయులిద్దరికీ వివాహం చేయాలనుకుంటున్న ఈవీవీ బురిడి హిట్ కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం. అయితే మోహన్ బాబు లానే ఈయన కూడా తనయులను హీరోలు చేద్దామని విశ్వ ప్రయత్నం చేస్తున్నా నరేష్ మనీ గ్యారెంటీ నటుడుగా ఎదిగితే ఆర్యన్ రాజేష్ మాత్రం అష్టకష్టాలు పడుతున్నాడు.
ఈ సారి బురిడీతో నైనా హిట్ కొట్టాలని ఈవీవీ గంపెడు ఆశతో ఉన్నారు. ఇక బురిడీ విడుదల అయి హిట్ అవుతుందా లేక హిట్ వికెట్ అయి ఆర్యన్ రాజేష్ కి యధాస్థితి మిగులుతుందా అన్నది సినిమా విడుదల అయ్యాకే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











